గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (18:48 IST)

నా భర్తకు చక్కెర వ్యాధి... వీర్యం స్ఖలించాక చర్మంపై పొక్కులు వస్తున్నాయ్.. ఎందుకని?

మాకు వివాహమై పదేళ్లు అయింది. మా దాంపత్య జీవితం సాఫీగానే సాగిపోతోంది. అయితే, గత యేడాది కాలంగా నా భర్తకు షుగర్ వ్యాధి వచ్చింది. అప్పటి నుంచి ఆయన సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఒకవేళ సెక్స్‌లో పాల్గొన్నా.. వీర్యం స్ఖలించిన తర్వాత అంగం చర్మంపై పగుళ్లు ఏర్పడి పొక్కులు వస్తున్నాయి. ఇది ఆయనకు ఇలా ఇబ్బందిగా ఉంది. దీనికి కారణం ఏంటి? 
 
సాధారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ యాంత్రిక జీవితాన్ని అనుభవిస్తారని చెప్పొచ్చు. దీంతో చక్కెర వ్యాధి బారిన పడటం కామనైపోయింది. శరీరంలో షుగర్ లెవల్స్ భారీగా పెరిగినట్టయితే, అప్పుడది మూత్రం ద్వారా వెళుతుంది. ఫలితంగా బ్యాక్టీరియా కూడా అక్కడ బాగా పెరుగుతుంది. 
 
పురుషాంగం పూర్వచర్మం షుగర్‌తో కూడిన మూత్రంతో తడవడం వల్ల చర్మం దెబ్బతింటుంది. క్రమంగా అంగం చివరి చర్మం బిగుతుగా మారి మూసుకుపోయి మూత్రం సరిగా రాకుండా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలాంటి సమస్యనే బెలనాప్టైటిస్ అని అంటారు. 
 
ఇలాంటి సమస్యకు యాంటిబయాటిక్ మందులు వాడటం ద్వారా తగ్గించవచ్చు. కానీ శాశ్వత పరిష్కారమార్గం మాత్రం సున్తీ చేయించుకోవడమే. ఐతే షుగ్ పాళ్లను ఎప్పుడూ 180 ఎంజీ/డీఎల్ దాటకుండా చూసుకుంటే ఇలాంటి సమస్యలు రావు.