బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (16:47 IST)

సమ్మర్‌లో శక్తినిచ్చే పుదీనా జ్యూస్ తయారీ ఎలా?

సమ్మర్ అంటేనే వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. బయటకు వెళ్లకపోయినా.. ఆ వేడికి శరీరం కందిపోతుంది. ఎండతోపాటు, వడగాలుల వల్ల మనుషుల్లో ఎనర్జీ శాతం బాగా తగ్గిపోతుంది. రోజూ చెమట, ఎండతో విసుగుకలుగుతుంది. కానీ సమ్మర్‌లో ఫ్రెష్‌గా, తాజాగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అది సాధ్యంకాని పని అనుకుంటారు చాలా మంది. అయితే.. కొన్నికిటుకులు పాటిస్తే రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉండేలా సహాయపడుతుంది. ఘుమఘుమ వాసన కలిగిన పుదీన సమ్మర్‌లో చల్లచల్లగా ఉండేలా చేస్తుంది. సలాడ్స్, డ్రింక్స్‌లో పుదీనను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే సమ్మర్‌లో ఎదురయ్యే అనేక అనారోగ్య సమస్యలను.. పుదీన ద్వారా పరిష్కరించుకోవచ్చు. అటువంటి పుదీనాతో జ్యూస్ ఎలా చేయాలో ఇప్పుడు తెల్సుకుందాం!
 
కావలసిన పదార్థాలు: 
పుదీనా - ఒక కట్ట
సోంపు పొడి- ఒక టీ స్పూను
నిమ్మకాయ - ఒకటి
జీలకర్ర పొడి - ఒక టీ స్పూను
వాము పొడి - అర టీ స్పూను
మిరియాల పొడి - కొద్దిగా
ఉప్పు - తగినంత
నీళ్లు - ఒక లీటరు.
 
తయారుచేయు విధానం:
ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ ముద్దను నీళ్లలో కలిపి, అందులో జీలకర్ర పొడి, సోంపు పొడి, వాము పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన రసాన్ని బాటిల్ లో పోసుకుని  మనకి కావాల్సినప్పుడల్లా తాగొచ్చు. అంతే సమ్మర్ డ్రింక్ రెడీ.