శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2016 (15:20 IST)

పొట్ట బాగా పెరిగిపోయిందా? తగ్గాలంటే.. రోజూ ఆకుకూరలు తినండి

గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? పొట్ట బాగా పెరిగిపోయిందా? అయితే ఈ టిప్స్ పాటించండి. ముందుగా ఆహార నియమాల్లో మార్పులు చేసుకోండి. పొట్ట తగ్గాలంటే రోజూ ఆకుకూరలు తీసుకోవాలి. ఆకుకూరల్లో క్యాలరీల

గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? పొట్ట బాగా పెరిగిపోయిందా? అయితే ఈ టిప్స్ పాటించండి. ముందుగా ఆహార నియమాల్లో మార్పులు చేసుకోండి. పొట్ట తగ్గాలంటే రోజూ ఆకుకూరలు తీసుకోవాలి. ఆకుకూరల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌ ఎక్కువగా లభిస్తుంది. అదే సమయంలో మినరల్స్‌, విటమిన్స్‌ తగినన్ని లభిస్తాయి. తద్వారా పొట్ట తగ్గుతుంది. 
 
చేపనూనెలో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు నిల్వలను, నడుము చుట్టు ఉన్న కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇంకా పుచ్చకాయ తీసుకుంటే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. పుచ్చకాయలో 82 శాతం నీరే ఉంటుంది కాబట్టి శరీరంలో అదనంగా ఉన్న సోడియంను ఇది తొలగిస్తుంది. 
 
బీన్స్‌ను వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా బీన్స్‌ తినడం వల్ల ఎక్కువ సమయం పొట్ట నిండి ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. తక్కువ క్యాలరీలు ఉండే మరో ఆహారం దోసకాయ. ఇందులో 96 శాతం వాటర్‌ కంటెంట్‌ ఉంటుంది. అవొకడొలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు సులభంగా తగ్గాలంటే రోజూ ఈ పండును తీసుకోవాలి.