గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:37 IST)

టీ తాగండి.. ఎముకలకు బలాన్నివ్వండి.. గ్రీన్ టీలో తేనె, నిమ్మరసం కలిపితే?

పాలతో తయారు చేసే టీని సేవించడం ద్వారా ఎముకలకు బలం చేకూర్చినట్లవుతుందని.. ఇందులోని ఫైటోకెమికల్స్ నొప్పిని తగ్గించడంతో పాటు ఎముకల దృఢత్వానికి తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా అసలు టీ తాగని

పాలతో తయారు చేసే టీని సేవించడం ద్వారా ఎముకలకు బలం చేకూర్చినట్లవుతుందని.. ఇందులోని ఫైటోకెమికల్స్ నొప్పిని తగ్గించడంతో పాటు ఎముకల దృఢత్వానికి తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా అసలు టీ తాగని వాళ్లతో పోల్చితే టీ తాగేవాళ్లలోనే ఎముకలు బలంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

కదలకుండా 8 నుంచి 9 గంటల పాటు పనిచేస్తూ.. ఒత్తిడికి గురయ్యేవాళ్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. అలాంటివాళ్లు భోజనం చేశాక అరగంట తరవాత టీస్పూను వాము, కాస్త అల్లం కలిపిన టీ తాగితే ఫలితం ఉంటుంది. తేన్పులు, కడుపులో మంటను దూరం చేసుకోవచ్చు. 
 
అంతేగాకుండా ఛమేలీ టీని రోజుకు మూడు నుంచి నాలుగు కప్పులు తీసుకుంటే.. నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. ఒత్తిడిని నయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే.. బ్లాక్ టీని రోజుకు రెండుసార్లు తాగడం ద్వారా ఒత్తిడిని తగ్గించే హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఇక ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లలో గ్రీన్‌టీలోని కెటెచిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో కాస్త తేనె, నిమ్మరసం కూడా కలిపితే మరింత ఫలితం ఉంటుంది. 
 
ఇలా రోజూ మూడు కప్పుల గ్రీన్ టీ తాగితే.. అలర్జీలను కూడా దూరం చేసుకోవచ్చు. కాఫీ, టీల కంటే ఈ గ్రీన్ టీ ద్వారా రోగనిరోధక శక్తి ఐదు రెట్లు పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది.