శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (18:23 IST)

మౌనం పాటించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

గల గల మాట్లాడటం కంటే మౌనం పాటించడం వల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు ఒక్కరు మౌనం పాటిస్తే ఆ గొడవ అంతటితో సద్దుమణుగుతుంది. ఎందుకంటే కొపంలో ఉన్న వారు ఏమి మాట్లాడతారో తెలియదు.

గల గల మాట్లాడటం కంటే మౌనం పాటించడం వల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు ఒక్కరు మౌనం పాటిస్తే ఆ గొడవ అంతటితో సద్దుమణుగుతుంది. ఎందుకంటే కొపంలో ఉన్న వారు ఏమి మాట్లాడతారో తెలియదు. కోపంలో రగిలిపోయేవారు మాట్లాడే మాట ఎదుటి వారిని భాదిస్తుంది. అందుకే గొడవ పడుతున్నప్పుడు మౌనం వహించడం చాలా మంచిది. ఇలా మౌనంగా ఉండడం వల్ల నిజజీవితంలో చాలా లాభాలు వున్నాయి. అంతేకాకుండా రోజుకు ఒక గంట సేపు మౌనంగా ఉండడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
 
* మౌనం వహించడం భాగస్వామితో, మిత్రులతో, మన అనుకునే వాళ్ళతో బంధాలను మెరుగుపరుస్తుంది.
* మౌనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
* మనలోని మంచిని పెంచుతుంది.
* మౌనం పక్క వాళ్లకు తమ తప్పును అర్ధం చేసుకోనేలా చేస్తుంది.
* మౌనం మానసికంగా మెరుగుపడేందుకు తోడ్పడుతుంది.