శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (12:43 IST)

గర్భనిరోధక మాత్రలు వాడితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే!

చాలా మంది స్త్రీలు గర్భ నిరోధక మాత్రలు వాడి ఆరోగ్యానికి హాని కొని తెచ్చుకుంటున్నారు. గర్భనిరోధక మాత్రలను కూడా ఎక్కువ కాలం ఉపయోగిస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేక

చాలా మంది స్త్రీలు గర్భ నిరోధక మాత్రలు వాడి ఆరోగ్యానికి హాని కొని తెచ్చుకుంటున్నారు. గర్భనిరోధక మాత్రలను కూడా ఎక్కువ కాలం ఉపయోగిస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ మాత్రలను ఉపయోగించే వారికి కళ్ల సమస్యలు వస్తున్నట్టు నిపుణులు అంటున్నారు. అవాంచిత గర్భంను తొలగించేందుకు, గర్భం వస్తుందనే భయంతో ఇటీవల యువత ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు వినియోగిస్తున్నారు. 
 
ఈ మాత్రలు మోతాదును మించితే ప్రాణహాని కలుగుతుందని స్త్రీలు గుర్తించట్లేదు. గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో ఐరెన్‌ శాతం బాగా తగ్గుతుందని, దాంతో ఐరన్‌ లోపానికి సంబంధించిన వ్యాధుల బారిన పడతారని వైద్యులు అంటున్నారు. అంతేకాదు ఈ మాత్రలు అధికంగా ఉపయోగించడం వల్ల ఆడవారికి జట్టు ఊడిపోయే సమస్య వస్తుందట. 
 
జట్టు పెరుగుదలకు ఉపయోగపడే కణాలను ఈ మాత్రలు దెబ్బ తీస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ మాత్రల కారణంగా మెగ్నీషియంతో పాటు పలు కీలకమైన లవణాలు శరీరంలో తగ్గిపోవడంతో నీరసంగా కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మోతాదుకు మించిన గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం మంచిది కాదు.