శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (09:48 IST)

స్త్రీలు ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి.. మగవారు ఓ గుడ్డ చుట్టుకుని..?

ప్రతీ మనిషి దైనందిన జీవితంలో స్నానం ఎంతో ముఖ్యం. కాని ఆ స్నానాన్ని చాలామంది ఏదో పనిలా చేస్తుంటారు. నిజానికి స్నానం కనీసం అరగంట సేపైనా చేయాలి. అది కూడా ఎలాగంటే... శరీరాన్నినీటితో బాగా తడిపి, సున్నిపిండ

ప్రతీ మనిషి దైనందిన జీవితంలో స్నానం ఎంతో ముఖ్యం. కాని ఆ స్నానాన్ని చాలామంది ఏదో పనిలా చేస్తుంటారు. నిజానికి స్నానం కనీసం అరగంట సేపైనా చేయాలి. అది కూడా ఎలాగంటే... శరీరాన్నినీటితో బాగా తడిపి, సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకుని, ఆపై నీటితో శుభ్రపర్చుకోవాలి. స్నానాంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తడుచుకోకపోవడం వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశంలో సూక్ష్మజీవులు అభివృద్ది చెందుతాయి. కాబట్టి శుభ్రంగా స్నానం చేసి ఆ తరువాత శరీరాన్ని తుడిచి దుస్తులు వేసుకోవాలి. ఇంకా స్నానం ఎలా చేయాలో తెల్సుకుందాం...
 
* తెల్లవారు జామున నాలుగు, ఐదు మధ్య చేసే స్నానాన్ని ముని స్నానం అంటారు. ఆ సమయంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి.
* స్త్రీలు ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చెయ్యాలి.
* మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకుని స్నానం చెయ్యాలి.
* ఉదయం ఐదు, ఆరు మధ్య చేసేది స్నానాన్ని దైవ స్నానం అంటారు.
* ఆరు, ఏడుల మధ్య చేసేది మానవ స్నానం, ఆపై చేసేది రాక్షస స్నానం.
* చన్నీటి స్నానం మంచిది. నదీ స్నానం ఉత్తమోత్తమం. చెరువు స్నానం మధ్యమం. నూతి స్నానం అధమం.