Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గొంతు గరగరగా.. మంటగా ఉంటే..?

గురువారం, 28 జనవరి 2016 (09:05 IST)

Widgets Magazine

సాధారణంగా చలికాలంలో జలుబు బాగా ఇబ్బంది పెడుతుంది. దీనికితోడు గొంతు ఇన్‌ఫెక్షన్ కూడా తరచూ వస్తుంటుంది. వీటిని అధిగమించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో పరిశీలిద్ధాం. 
 
ప్రతి ఒక్క ఇంట్లో పసుపుపొడి తప్పకుండా ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. కప్పు పాలలో చిటికెడు పసుపు చేర్చి తీసుకుంటే సమస్యను త్వరగా దూరం చేస్తాయి.
 
గొంతులో మంట, పట్టేసినట్టు నొప్పి విపరీతంగా బాధిస్తుంటే దాల్చిన చెక్క నూనె చెంచా తీసుకుని అందులో మరో చెంచా తేనె కలిపి తాగితే తక్షణం ఉపశమనం ఉంటుంది. అవసరమైతే వేడి నీటిలో తేనె వేసుకుని పుక్కిలిస్తే ఎంతో మంచిది. 
 
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. వెల్లుల్లిని మెత్తగా చేసి అందులో ఉప్పూ, కారం కొంచెం కలిపి వేడి వేడి అన్నంలో తీసుకుంటే రుచిగా ఉండడమే కాదు గొంతు ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. 
 
ఓ గ్లాసు వేడి నీటిలో దాల్చిన చెక్క, మిరియాల పొడిని ఓ చెంచా కలపాలి. కాసేపైన తర్వాత వడకట్టి పుక్కిలించాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయడం వల్ల సమస్య నుంచి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజూ ఒక కప్పు 200 గ్రాములు పుట్టగొడుగులు తింటే?

పుట్టగొడుగులు అందరు తినే ఆహారపదార్థము. ఇవి మాంసాహారంతో సమానమైన పోషక విలువలను కలిగియుంది. ...

news

ప్రతి రోజూ ఒక కమలా పండు తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

ఆరెంజ్ పండును చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపిస్తుంది. నారింజ పండ్లు చలికాలంలో ...

news

అల్పాహారంగా గుడ్డును తీసుకుంటే..

పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డును ఇష్టపడిని వారుండరు. ఎదిగే పిల్లలకు అవసరమైన ప్రోటీన్లను ...

news

అరకప్పు బ్రౌన్ రైస్‌తో సంపూర్ణ ఆరోగ్యం.. ఎలా?

దక్షిణ భారతదేశంలో ప్రధానంగా అందరూ తినే ముఖ్యమైన ఆహారం అన్నం. ప్రతి రోజూ తినే అన్నం ...

Widgets Magazine