Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గర్భిణీ మహిళలు జంక్ ఫుడ్‌ను పక్కనబెట్టకపోతే...

సోమవారం, 22 జనవరి 2018 (11:10 IST)

Widgets Magazine
Pregnant Women

గర్భధారణకు ముందు.. తర్వాత బరువు తగ్గడం చాలా మేలు. అధిక బరువు ఉండటం వల్ల గర్భం ధరించే అవకాశాలు తక్కువ. గర్భం ధరించాక కూడా ఎత్తుకు తగిన బరువు ఉండాలి. గర్భధారణ సమయంలో కొన్ని వ్యాయామలు క్రమం తప్పకుండా చేయాలి. దాంతో మీ శరీరంలోని హార్మోనులు క్రమంగా పనిచేయడానికి సమతుల్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది.
 
వ్యాయామాల్లో కఠినమైన లేదా బలమైన వాటికి దూరంగా ఉండాలి. లేదంటే ఆ ఒత్తిడి యూట్రస్(గర్భాశయం) మీద ఎక్కువగా పడుతుంది. గర్భంగా ఉన్నప్పుడు డాక్టర్ల సలహా మేరకు వ్యాయామాలు ఎంచుకోవాలి. సంతానోత్పత్తికి ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, వెన్న తీసిన పాలు, పెరుగు వంటివి మహిళలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. సంతానోత్పత్తికి బద్ద శత్రువు ఒత్తిడి ఒకటి. గర్భంగా ఉన్నప్పుడు, ధరించాలనుకుంటున్నట్లేతే ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవాలి.
 
గర్భంగా ఉన్నప్పుడు సలాడ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి. ఇవి జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. గర్భధారణ సమయంలో ఆకలి పెరగటానికి సహాయం చేస్తాయి. గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ పూర్తిగా మానివేయాలి. జంక్ ఆహారాలు మీకు మీ శిశువుకు మంచిది కాదు. అంతేకాకుండా, అది ఆకలిని కూడా తగ్గిస్తుంది. జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించడం ద్వారా గర్భధారణ సమయంలో ఆకలిని పెంచవచ్చు. 
 
మీరు రొటీన్ వంటకాలతో విసుగు చెంది ఉంటే అప్పుడు మీరు కొత్త వంటకాలకు ప్రయత్నించవచ్చు. మీ ఆహారంలో రుచి మారితే కచ్చితంగా మీ ఆకలిని పెంచుతుంది. పుట్టబోయే బిడ్డలో కార్టిజోల్ డెవలప్ మెంట్‌కు తులసీ సహాయపడుతుంది. వారానికి నాలుగైదు తులసి ఆకులైనా తీసుకోవడం మంచిది. సూప్స్, సలాడ్స్‌లో రెండేసి ఆకులు చేర్చుకుని తీసుకోవాలి. 
 
తులసిలో ఉండే మాంగనీస్ పుట్టబోయే బిడ్డలో ఎముకలు, కార్టిలేజ్ ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇంకా మ్యాంగనీస్ పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. తులసిలో ఉండే పొల్లెట్ కంటెంట్ ప్రెగ్నెన్సీ సమయంలో అవసరమయ్యే అదనపు రక్తాన్ని అందిస్తుంది. ఇంకా, ఇది బేబీ పుట్టుకలో లోపాలను నివారిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గర్భనిరోధక మాత్రలు : ఎలుకలపై ప్రయోగం సక్సెస్.. ఇక పురుషులపై...

ఇంతవరకు స్త్రీలకు మాత్రమే పరిమితమైన గర్భనిరోధక మాత్రలు ఇపుడు పురుషులకు కూడా అందుబాటులోకి ...

news

చిప్స్ తిన్నారో అంతే సంగతులు..

రోజూ చిప్స్ తీసుకుంటే వాటిలోని హైఫ్యాట్ కెలోరీల ద్వారా బరువు పెరుగుతారు. ఒబిసిటీ తప్పదు. ...

news

పాలిచ్చే తల్లుల్లో ఆ కోర్కెలు వుండవా?

పాలిచ్చే తల్లుల్లో లైంగిక వాంఛలు తక్కువగా వుండటానికి కారణాలను గైనకాలజిస్టులు ఇలా ...

news

అనారోగ్యాలకు చెక్ పెట్టాలంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే?

వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలా? అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలా? అయితే ఈ టిప్స్ ...

Widgets Magazine