శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2016 (09:24 IST)

జుట్టు నెరవడాన్ని అడ్డుకునే ఉసిరి నూనె

ఉసిరి నూనె జుట్టు నెరవడాన్ని ఆపుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ నూనె వాడడం వల్ల జుట్టుకి మంచి పోషకాలు అందుతాయి. కొబ్బరి తురుములో కొద్దిగా నీళ్లు కలపాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును పిండితే చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. ఆ పాలతో జుట్టు కుదుళ్లకు మర్దనా చేయాలి. వారంలో మూడుసార్లు చేస్తే జుట్టు రాలదు.
 
చుండ్రు వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోవడమే కాకుండా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కూడా. అందుకని ముందు చుండ్రును నివారించాలి. మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను మాడుకి పట్టించి అరగంట తరువాత నీళ్లతో కడిగేయాలి. 
 
మెంతులతో తయారుచేసే టీ ఆరోగ్యానికే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో దోహదం చేస్తుంది. రోజూ మెంతుల టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. గుడ్డు తెల్లసొనను మాడుకి పట్టించి పావుగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా పోషకాలు అందుతాయి. గుడ్డులో ఉండే ప్రొటీన్‌ వల్ల పోషకాలు లభిస్తాయి.