మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (09:26 IST)

వెంట్రుకలు రాలిపోతున్నాయా...!

చాలామంది పురుషులు, మహిళల్లో వెంట్రుకలు రాలిపోవడం పెద్ద సమస్యగా ఉంది. తయారవుతోంది. దీనికి ప్రధాన కారణం...సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోకపోవడమేనని నిపుణులు అంటున్నారు. మానసికపరమైన ఒత్తిడి, నిద్రలేమి, తలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, వంశపారంపర్యం తదితర కారణాలుంటాయని వైద్యులు చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వెంట్రుకలు రాలిపోకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి... 
 
పోషకపదార్థాలు కలిగిన పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తలను శుభ్రంగా ఉంచేందుకు వారానికి కనీసం రెండుసార్లయినా తలస్నానం చేయాలి. 
 
పాలాకును ఆహారంగా తీసుకుంటుంటే వెంట్రుకలు రాలడాన్ని పూర్తిగా నివారించవచ్చంటున్నారు వైద్యులు. ఇందులో శరీరానికి కావలసని ఇనుము పుష్కలంగా ఉంది. వెంట్రుకల రాలకుండా ఉండేందుకు శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటే వెంట్రుకలు రాలకుండా ఉంటుంది. 
 
వెంట్రుకలు పెరిగేందుకు ఉసిరికాయ ఎంతో తోడ్పడుతుంది. ఉసిరికాయలను ముక్కలుగా చేసుకుని ఎండబెట్టాలి. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరి నూనెలో మరిగించి ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలడం తగ్గడంతోపాటు వెంట్రులకులు కూడా పెరుగుతాయి.