శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (18:39 IST)

కొబ్బరినూనె, వేపనూనెను మిక్స్‌ చేసి కాళ్లూ, చేతులకు పట్టిస్తే దోమలు కుట్టవ్..

ఒక కప్పు నీటిలో పది తులసి ఆకుల్ని బాయిల్ చేసి ఆ నీటిని తాగితే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ఇలా ప్రతిరోజూ చేస్తే దోమలతో ఏర్పడే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అలాగే కాలే కర్పూరంపై ఐదారు చుక్కల వేపనూనె వ

ఒక కప్పు నీటిలో పది తులసి ఆకుల్ని బాయిల్ చేసి ఆ నీటిని తాగితే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ఇలా ప్రతిరోజూ చేస్తే దోమలతో ఏర్పడే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అలాగే కాలే కర్పూరంపై ఐదారు చుక్కల వేపనూనె వేసి ఇంట్లోని గాలి బయటికి పోకుండా డోర్‌ వేయాలి. ఇలా ఇరవై నిమిషాల పాటు ఉంచితే దోమలు పారిపోతాయి.
 
ఇంకా దోమలు కాటు నుంచి తప్పించుకోవాలంటే.. కొబ్బరినూనె, వేపనూనెను మిక్స్‌ చేసి కాళ్లూ, చేతులకు పట్టిస్తే సరిపోతుంది. కిటికీలు, ఓపెన్‌ ప్లేస్‌లో ఉల్లిపాయలు ఉంచటం వల్ల కూడా దోమలు పారిపోతాయి. వేపనూనెలో ముంచిన కాటన్‌బాల్స్‌ను ఇంట్లో ఉంచితే దోమలు రావు. ఈ చిట్కాలతో పాటు దోమలు లేకుండా ఉండాలంటే ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.