గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By srinivas
Last Modified: గురువారం, 23 ఆగస్టు 2018 (15:06 IST)

కొబ్బరినూనె వినియోగం ఆరోగ్యానికి హానికరమా? నిజమా?

వివిధ రకాల డైట్ ప్లాన్లో కొబ్బరినూనెను ఆరోగ్యప్రదాయినిగా ప్రోత్సహిస్తున్నారు. మధుమేహం తగ్గుతుందని, అల్సర్, కేన్సర్ వంటి రోగాలను అడ్డుకోవడంలో బాగా పని చేస్తుందని చెపుతున్నారు. దీనితో ఈమధ్య కొబ్బరినూనె వినియోగం విపరీతంగా పెరిగింది. కీటోన్ డైట్లో కొబ్బర

వివిధ రకాల డైట్ ప్లాన్లో కొబ్బరినూనెను ఆరోగ్యప్రదాయినిగా ప్రోత్సహిస్తున్నారు. మధుమేహం తగ్గుతుందని, అల్సర్, కేన్సర్ వంటి రోగాలను అడ్డుకోవడంలో బాగా పని చేస్తుందని చెపుతున్నారు. దీనితో ఈమధ్య కొబ్బరినూనె వినియోగం విపరీతంగా పెరిగింది. కీటోన్ డైట్లో కొబ్బరినూనె  కీలకంగా మారింది. కొబ్బరి నూనెను కేరళీయులు ఎప్పటినుంచో వాడుతున్నారు. తెలుగు ప్రజలకు పెద్దగా కొబ్బరినూనె వినియోగం అలవాటు లేదు. 
 
సర్వరోగ నివారిణిగా కొబ్బరినూనె నేడు ప్రాచూర్యం పొందడం, కొబ్బరినూనెను ప్రోత్సహిస్తుండటంతో సూపర్‌ మార్కెట్లలో కొబ్బరినూనె కోసం ప్రత్యేక కౌంటర్లు పెడుతున్నారు. నాలుగేండ్లలో అమ్మకాలు 16 రెట్లకు పైగా పెరిగాయి. అయితే కొబ్బరినూనె వినియోగం ఆరోగ్యానికి హాని చేస్తుందని హార్వర్డ్ ప్రొఫెసర్ కారిన్ మిషెల్స్ హెచ్చరిస్తున్నారు. 
 
కొబ్బరినూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్డీఎల్ పరిమామాన్ని పెంచుతుందని ఆమె హెచ్చరించారు. సమతుల ఆహారంలో కొబ్బరినూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే ఫరవాలేదని, శ్రుతిమించితే గుండెజబ్బులు తప్పవని ఆమె తెలిపారు. యూనివర్సిటీ ఆప్ ఫ్రీబుర్గ్‌లో కోకోనట్ ఆయిల్ ఇతర పోషక తప్పిదాలు అనే అంశంపై  ప్రసంగం చేస్తూ కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలు ఏమిటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని పేర్కొన్నారు. కొబ్బరినూనెలో 86 శాతం సాంద్రతరమైన కొవ్వు ఉంటుందని, ఇది వెన్నకన్నా మూడోవంతు ఎక్కువని ప్రొఫెసర్ మిషెల్స్ ఉటంకించారు.
 
సాంద్రమైన కొవ్వు వల్ల రక్తంలో ఎల్డీఎల్ పెరిగి గండెజబ్బులు, స్ట్రోక్ రావడం అనేది నిర్ధారణ అయిన విషయమని చెప్పారు. కొబ్బరినూనె రుచిని ఇష్టపడేవారు కావాలంటే అతితక్కువ మోతాదులోనే వాడాలని ప్రొఫెసర్ మిషెల్ స్పష్టం చేశారు. జర్మనీ భాషలో ఆమె చేసిన ఈ ప్రసంగం వీడియో ఇప్పటిదాకా యూట్యూబ్‌లో పదిలక్షల మంది వరకూ చూశారు.