పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే.. నెలసరి సమస్యలు మటాష్

సోమవారం, 20 మార్చి 2017 (18:06 IST)

పుదీనాను రోజూవారీగా ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలోని రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఉదరంలోని సూక్ష్మక్రిములను పుదీనా నశింపజేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు.. ఎండిన పుదీనాను గుప్పెడు తీసుకుని.. ఒకటిన్నర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించి.. ఆ నీటిని  సేవించాలి. ఇలా చేస్తే జ్వరం తగ్గిపోతుంది. 
 
అలాగే మాంసాహారం, కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే.. పుదీనాను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి. జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది. నెలసరి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మహిళలు పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే మంచిది. పుదీనా చట్నీ తీసుకుంటే.. ఉదర సమస్యలు దరిచేరవు. గర్భవతులు వేవిళ్లు తగ్గించుకోవాలంటే.. పుదీనాను డైట్‌లో చేర్చుకోవాలి. 
 
పచ్చ కామెర్లు, వాతం, దగ్గు, రక్తహీనత, నరాల బలహీనతకు పుదీనా దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మం పొడిబారినట్లు కనిపిస్తే.. పుదీనా రసాన్ని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పుదీనాను నీడలో ఎండబెట్టి పాలలో చేర్చి మరిగించి.. టీకి బదులుగా సేవిస్తే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని వారు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Benefits Immunity Milk Fever Non Veg Mint Leaves

Loading comments ...

ఆరోగ్యం

news

వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికపాటి ఆహారం.. తగినన్ని నీరు తీసుకోండి..

వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం ...

news

చికెన్ తింటున్నారా? కోడి మెడను, రెక్కల్ని మాత్రం పక్కనబెట్టేయండి..

చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగట్లేదా? కోడి కూర, లేదా ఇతరత్రా వెరైటీలు టేస్టీగా వండిపెడితే ...

news

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? ఐతే ఇవి తీసుకోండి..

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? అయితే మందులు వాడటం చేస్తున్నారా? అయితే కాస్త ...

news

సెల్ ఫోన్ రేడియేషన్ పుణ్యంతో పిచ్చుకలు మాయం.. కాపాడండి.. మహాప్రభో..!

ఆధునీకరణ పేరుతో ప్రకృతి సంపద కనుమరుగువుతూ వస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం భవనాల సంఖ్య ...