కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి? జాగ్రత్తలేమిటి?

శుక్రవారం, 30 జూన్ 2017 (21:36 IST)

kidney stones

కిడ్నీలో రాళ్లకు కారణం కొన్ని ఆహార పదార్థాలే. పాలు, పాలకూర, సోయాబీన్స్, చాక్లెట్లు వంటివి కిడ్నీలో రాళ్లకు కారణమవుతాయి. అంతేకాదు... టమోటాల పైన పల్చగా వుండే పొర, కొబ్బరిపై వుండే టెంకలాంటివి కిడ్నీలలో రాళ్లు ఏర్పడేందుకు కారణాలవుతాయి. అందుకే కిడ్నీలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
 
* క్యాల్షియం సప్లిమెంట్లు తగిన మోతాదులో వుండేలా చూసుకోవాలి. వైద్యుల సలహా మేరకు వాటిని తీసుకుంటూ వుండాలి.
 
* రోజుకు తప్పనిసరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల మూత్రం విసర్జించాల్సి వుంటుంది. కాబట్టి శరీర కణాల నిర్వహణకుపోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి 4 లీటర్ల మంచినీళ్లు తాగాలి. 
 
* ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. కాబట్టి వాటిని తీసుకోరాదు.
 
* ఆరెంజ్ రసానికి క్యాల్షియం ఆక్సలేటును రాయిగా మారకుండా నిరోధించే లక్షణం వుంది. కాబట్టి ఆరెంజ్ రసం మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్ సమస్యకు దారితీసే అవకాశం వుంది. అందుకే పుల్లని పండ్లను ఎక్కువగా తీసుకోరాదు. అంతేకాదు కూల్ డ్రింక్స్ జోలికి అసలు వెళ్లకూడదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజుకు ఓ కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే...?

దక్షిణ భారతదేశంలోని కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటకాల్లో ...

news

భార్యాభర్తలు శారీరక సుఖానికి దూరమైతే...

భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక సంబంధం (శృంగారం) అనేది తాత్కాలిక ...

news

మతిమరుపుకు దివ్యౌషధంగా పనిచేసే కాఫీ

వృద్ధాప్యంతో సంబంధం లేకుండా చాలామందిని భయపెడుతున్న సమస్య మతిమరుపు. అలాంటి మతిమరుపుకు కాఫీ ...

news

దంపతులు నిద్రలేమిని అంత సులభంగా తీసుకోకూడదట.. ఎందుకంటే?

దంపతులు నిద్రలేమిని అంత సులభంగా తీసుకోకూడదంటున్నారు.. అమెరికా శాస్త్రవేత్తలు. దంపతుల్లో ...