బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (11:52 IST)

ఆ వయసులో పెళ్లయితే గర్భందాల్చే ప్రయత్నం ఎపుడు చేయాలి?

దంపతులిద్దరూ నిండు ఆరోగ్యంతో ఉంటారు. ఇద్దరిలోనూ ఎలాంటి లోపాలూ ఉండవు. అయినా ఏళ్లు గడిచినా వారికి పిల్లలు పుట్టరు. అలాంటప్పుడు ఇక ఈ జన్మలో తల్లితండ్రులమయ్యే భాగ్యం మాకు లేదనుకుని కుంగిపోతుంటారు.

దంపతులిద్దరూ నిండు ఆరోగ్యంతో ఉంటారు. ఇద్దరిలోనూ ఎలాంటి లోపాలూ ఉండవు. అయినా ఏళ్లు గడిచినా వారికి పిల్లలు పుట్టరు. అలాంటప్పుడు ఇక ఈ జన్మలో తల్లితండ్రులమయ్యే భాగ్యం మాకు లేదనుకుని కుంగిపోతుంటారు. సరైన సమయంలో వైద్యులను కలిసి కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే పండంటి బిడ్డనుకనే వీలుందని వైద్యులు చెపుతున్నారు. 
 
సాధారణంగా స్త్రీల గర్భధారణకు అనువైన వయసు 24 నుంచి 30 ఏళ్లు. 35 ఏళ్ల వరకూ గర్భం దాల్చే వీలున్నా, 30వ సంవత్సరంలో పెళ్లైతే ఆరు నెలల్లోపే గర్భందాల్చే ప్రయత్నం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ 30 ఏళ్ల వయసులో పెళ్లై 6 నెలలైనా గర్భం దాల్చకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని కలవాలి. అంతకంటే ముందు పెళ్లైతే సాధ్యమైనంత త్వరగా పిల్లల్నికనే ప్రయత్నం చేయటం మంచిది. 
 
ఎందుకంటే చదువు, కెరీర్‌పరంగా గర్భధారణను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయటం వల్ల గర్భం దాల్చే అవకాశాలను చేతులారా నాశనం చేసుకున్న వాళ్లవుతారని వైద్యులు అంటున్నారు. పూర్వకాలంలో 35, 40 ఏళ్ల వయసులో కూడా పండంటి బిడ్డను ప్రసవించగలిగేవాళ్లు. కానీ కాలక్రమేణా పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. 30 దాటిన తర్వాత గర్భం దాల్చగలిగినా పుట్టే పిల్లల్లో అవకరాలు ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. స్త్రీపురుషులిద్దరూ 32 యేళ్లలోపు (స్త్రీ అయితే 30 యేళ్లు, పురుషుడు అయితే 35 యేళ్లు) పిల్లను కనేందుకు ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు.