గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 20 ఏప్రియల్ 2019 (20:01 IST)

శాకాహారం ఎందుకు తీసుకోవాలంటే?

శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాంసంతో పోలిస్తే.. వెజిటేరియన్ ఫుడ్ త్వరగా జీర్ణం అవుతుంది. అదీగాక జీవ హింస పాపం అని మనం భావిస్తుంటాం. మాంసం వినియోగం పెరిగేకొద్దీ వనరుల వాడకం ఎక్కువవుతుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు వెజిటేరియన్లుగా మారిపోతున్నారు. శాకాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కేన్సర్ లాంటి రోగాలకు దూరంగా ఉండటతోపాటు బీపీ, షుగర్ వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చు. శాకాహారం తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. శాకాహారం వల్ల గుండె పదిలంగా ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ బీపీని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌ వచ్చే ముప్పును తగ్గిస్తుంది. బీన్స్, కూరగాయలు, పప్పులు, బఠాణీలు తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా అందుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి శాకాహారం చాలా మంచిది. వయసు పెరిగేకొద్దీ వచ్చే అనారోగ్యం, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి వెజిటేరియన్ ఫుడ్ ఉపయోగపడుతుంది.
 
2. ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో మంచి బ్యాక్టీరియా ఉండటం అవసరమనే సంగతి తెలిసిందే. రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి ఇది అవసరం. శాకాహారం కండరాల్లో ఉండే మంచి బ్యాక్టీరియాపై సానుకూల ప్రభావం చూపుతుంది. కూరగాయలు, ఆకుకూరలతో పాటు పెరుగు తినడం వల్ల ఉదర సంబంధ సమస్యలు దూరమవుతాయి. శాకాహారంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 
 
3. అందరిని భయపెడుతున్న సమస్య డయాబెటిస్. నలబై ఏళ్లు దాటిన వారిలో ఎక్కువమంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. రోజూ ఎక్సర్‌సైజ్ చేస్తూ.. తక్కువ ఫ్యాట్ ఉండే శాఖాహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ను నియంత్రించొచ్చు. కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగవుతుంది. శాకాహారంతో డయాబెటిస్ రోగులు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించుకోవచ్చు. మాంసం తరచుగా తినేవారు టైప్2 డయాబెటిస్ బారిన పడే ముప్పు అధికం.
 
4. శాకాహారం తీసుకునే వారిలో మూడ్ బాగుంటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మాంసాహారంలో ఉండే అరాకిడోనిక్ యాసిడ్ మూడ్‌ను డిస్ట్రబ్ చేస్తుంది. మాంసం, చేపలు, గుడ్డును దూరం పెట్టడం వల్ల మూడ్ బాగుంటుందని బెనెడిక్టైన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. 
 
5. శాకాహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వెజ్ డైట్‌లో విటమిన్ బి12, విటమిన్ డి లోపిస్తుందని చాలామంది భావిస్తుంటారు. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపాన్ని నివారించొచ్చు.