గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : శనివారం, 5 మే 2018 (11:21 IST)

బరువు తగ్గాలనుకుంటే.. పండ్లను ఎప్పుడు తీసుకోవాలి?

పండ్లు ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనానికి మధ్య లేదా ఖాళీ కడుపుతో వున్నప్పుడు పండ్లను తీసుకోవచ్చు. అలాగే భోజనానికి

పండ్లు ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనానికి మధ్య లేదా ఖాళీ కడుపుతో వున్నప్పుడు పండ్లను తీసుకోవచ్చు. అలాగే భోజనానికి ముందు లేదా తర్వాత అరగంట విరామంతో పళ్లు తినాలి. ఇలా చేస్తే పండ్లలోని పోషకాలు శరీరానికి అందుతాయి. 
 
అదేవిధంగా వ్యాయామానికి ముందు తర్వాత పండ్లు తీసుకుంటే శరీరం అలసిపోకుండా ఉంటుంది. పళ్లలోని పోషకాలను శరీరం సమర్థంగా శోషించుకోవాలంటే అల్పాహారంగా పండ్లను తీసుకోవడం మరిచిపోకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి అరగంట ముందు పళ్లు తింటే పొట్ట నిండి ఆకలి తగ్గుతుంది. ఫలితంగా భోజనం తక్కువ తీసుకుంటారు. దీంతో బరువు తగ్గుతారు. ఒబిసిటీ దూరమవుతుంది. 
 
కానీ బరువు తగ్గాలనుకుంటే చక్కెర ఎక్కువగా ఉండే అరటి, మామిడి, ద్రాక్ష పళ్లు తినటం తగ్గించాలి.  కానీ నిద్రించేందుకు ముందు మాత్రం పండ్లను తీసుకోకూడదు. పుచ్చ, తర్బూజా లాంటి పళ్లు తిన్నా ఆకలి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.