శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 5 మే 2017 (19:35 IST)

తింటున్నారు సరే... తిన్నది ఒంటబడుతుందా లేదా?

జీర్ణక్రియ ఎప్పుడూ ఒకేలా వుండదు. వయసు పెరిగేకొద్దీ జీర్ణశక్తి బలహీనం అవుతుంటుంది. అందుకే అంతకుముందు ఆహారపుటలవాట్లను మెల్లగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటూ వుండాలి. తద్వారా మనం తీసుకునే ఆహారాన్ని శరీరానికి పూర్తిగా వినియోగ

జీర్ణక్రియ ఎప్పుడూ ఒకేలా వుండదు. వయసు పెరిగేకొద్దీ జీర్ణశక్తి బలహీనం అవుతుంటుంది. అందుకే అంతకుముందు ఆహారపుటలవాట్లను మెల్లగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటూ వుండాలి. తద్వారా మనం తీసుకునే ఆహారాన్ని శరీరానికి పూర్తిగా వినియోగమయ్యేలా చూస్తుంది. అంతేకాదు శరీరం బరువును నియంత్రణలో వుంచుతుంది. కొలెస్ట్రాల్ నిల్వలు నిలకడగా వుండేందుకు దోహదపడుతుంది. 
 
పీచు పదార్థాల విషయంలో కొంతమంది పట్టించుకోరు. బియ్యం, గోధుమలను అధికంగా తీసుకుంటారు. ఇలాంటివి వయసు పెరిగినవారిలో ఇబ్బందులను తీసుకొస్తాయి. మనం తీసుకునే ప్రతి 1000 క్యాలరీలలో కనీసం 14 గ్రాముల పీచు పదార్థం వుండేట్లు చూసుకోవాలి. ఓట్ మీల్, బెర్రీస్, నట్స్, యాపిల్, క్యారెట్లు వంటివి తీసుకోవాలి. వీటితోపాటు ముడి ధాన్యాలు, కొన్ని రకాల కూరగాయలు తీసుకుంటూ వుంటే జీర్ణంకాని వ్యర్థ పదార్థాలను బయటకు పంపేందుకు సహాయపడతాయి. ఫలితంగా పెద్దపేగు ఆరోగ్యవంతంగా వుంటుంది.