శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (15:35 IST)

స్త్రీల కంటే.. పురుషులే ముందుగా చనిపోతారట.. ఎందుకో తెలుసా?

సాధారణంగా జననమరణాలు ఏ ఒక్కరి చేతుల్లోనో లేవు. కానీ, పూర్వం స్త్రీపురుషులు ఎవరైనా కనీసం వందేళ్లు బతికేవారనే ప్రచారం ఉంది. కాలక్రమంలో మనిషి జీవితకాలం సగటు 60 యేళ్లకు పడిపోయింది. ఇందులో కూడా ఎక్కువగా స్త్రీల కంటే పురుషులే చనిపోతున్నట్టు తేలింది. 
 
ఇదే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ సౌథెర్న్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధక బృందం ఒక పరిశోధన చేసింది. ఇందులో మగవాళ్లు ఆడవాళ్ల కంటే తక్కువకాలం బ్రతుకుతున్నారని తేల్చింది. దీనికి కారణం లేకపోలేదు.
 
స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మానసిక ఒత్తిడి, బాధ్యతలు, కుటుంబ సమస్యలుతో పాటు చెడు అలవాట్లు కారణమంటున్నారు నిపుణులు. అయితే, ఈ పరిస్థితి ఏ ఒక్కదేశానికే పరిమితం కాలేదని, మొత్తం ప్రపంచలో ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిపింది.
 
అయితే మగవాళ్లు ఎక్కువగా గుండెపోటుతో చనిపోతున్నారట... 13 అభివృద్ధి చెందిన దేశాలలో 1800 నుంచి 1935వ సంవత్సరం వరకు పుట్టిన వారి జీవితకాలాన్ని పరిశోధించడం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అయితే పొగత్రాగడం తగ్గిస్తే కొంత వరకు గుండెపోటుతో ద్వారా చనిపోయే మరణాలను తగ్గించవచ్చంటున్నారు నిపుణులు.