Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీ, కాఫీలకు అలవాటు పడి.. తాగకపోతే తలనొప్పి ఎందుకొస్తుంది?

గురువారం, 18 మే 2017 (15:39 IST)

Widgets Magazine
coffee

ఉదయం, సాయంత్రం టీ, కాఫీలు తాగే అలవాటుందా? తాగకపోతే.. తలనొప్పి వచ్చేస్తుందా? అలాంటివారు మీరైతే ఈ స్టోరీ చదవండి. కాఫీ, టీలను తాగడం ద్వారా పేగులపై ఆహారం తీసుకునే వాంఛ తగ్గిపోతుంది. అందుకే టీ, కాఫీలు తాగితే ఆకలేయదు. పొట్ట, పేగుల్లో మంటలను, పూతలను రాకుండా ఒక రకమైన జిగురు పదార్థం కాపాడుతుంది. ఆ జిగురును పుట్టించే గ్లోబ్లెట్‌ కణాలపై వీటి ప్రభావం పడి ఆ జిగురు ఉత్పత్తిని కాఫీ, టీలు సగానికి సగం తగ్గించి వేస్తాయి. దీంతో కడుపులో మంటలు, అల్సర్లు వస్తాయి.
 
అల్సర్ సమస్యలొస్తే టీ, కాఫీలు మానకపోవడం ద్వారా ఆ సమస్యలు అలాగే వుండిపోతాయి. పొట్ట, పేగులలో ఆహారాన్ని అరిగించడానికి ఎన్నో ఎంజైములు ఊరతాయి. వాటి ఉత్పత్తిని టీ, కాఫీలు తగ్గిస్తాయి. నరాలు ఎక్కువగా ఉద్రేకపడి పనిచేస్తున్నందుకు త్వరగా అలసటకు గురవుతాయి. నరాలు అలసటకు గురికావడంతోనే టీ, కాఫీలను మానితే తలనొప్పి వస్తుంటుంది. 
 
రోజులో ఒకటి రెండుసార్లు ఓకే  కానీ ఐదు, ఆరు సార్లు టీ, కాఫీలు తాగితే కాలేయం దెబ్బతింటుంది. మెదడును ఎక్కువగా పనిచేయించే గుణాలుండే కాఫీ, టీల సేవనంతో ఎక్కువగా ఆలోచనలు రావడం, స్థిరంగా లేనట్లుగా అనిపించడం, చిరాకుగా ఉండడం, జరుగుతుంది. నరాలు ఎప్పుడూ ఉద్రేకంలో ఉండడం వల్ల రిలాక్సు కావు. దాంతో సరిగా నిద్ర రాదు. పడుకున్న వెంటనే నిద్ర పట్టదు.
 
ఈ కాఫీ టీల కంటే.. గోరువెచ్చని నీటిలో ఒకటి రెండు నిమ్మకాయలు పిండి పుల్లగా ఉండేట్లు తాగితే.. తలనొప్పి వుండదు. బరువు తగ్గుతారు. కాఫీ, టీ లకు బదులు తేనె నిమ్మరసం నీళ్లు, చెరకురసం, కొబ్బరినీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూర్చవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

46 డిగ్రీల సెంటీగ్రేడ్... భానుడి ఎండ దడ... వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?

వేసవి ప్రతాపం చురచురమంటోంది. భానుడి భగభగలతో ఇంచుమించు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ...

news

కూల్ డ్రింక్స్‌‌లో బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌తో సమానమైన ఆమ్లాలున్నాయా?

ఎండలు మండిపోతున్నాయి. ఇక చల్లచల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు.. చాలామంది. అయితే కూల్ ...

news

బీరు తాగిన వారిలో నొప్పులుండవ్.. ఆందోళన ఉండదట.. వేసవిలో తాగడం?

వేసవి కాలం మందు బాబు బీరు బాగా లాగించేస్తుంటారు. ఎండాకాలంలో చల్లిటి బీరుతో గొంతు ...

news

ఆవిరి పట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

చాలా మందికి జలుబు లేదా గుండె జలుబు చేసినా, తలపట్టేసినట్టు అనిపించినా ముఖానికి ఆవిరి ...

Widgets Magazine