బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (12:15 IST)

టిఫిన్ తినడం మానేస్తే.. ఇక అంతే సంగతులు..!

టిఫిన్ తినడం మానేస్తే మాత్రం ఇక అంతే సంగతులు. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఆరోగ్యానికి అనర్థాలు, అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హడావుడిగా ఉద్యోగాలకు వెళ్తూ ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోతే.. ఆరోగ్యానికి చాలా నష్టమే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఉదయం హడావుడిగా అల్పాహారం తీసుకోకుండా ఆఫీసులకు వెళ్లిపోతున్నారా.. పిల్లలు కూడా స్కూలుకు టైమ్ అయిపోతుందని టిఫిన్ మానేస్తే మాత్రం ఆరోగ్యానికి దెబ్బేనని వారు చెప్తున్నారు. రోజు మొత్తంలో ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం ప్రాముఖ్యత ఎక్కువ. 
 
అల్పాహారంపై జరిపిన అధ్యయనంలో 9-11 సంవత్సరాల వయసుగల విద్యార్థులలో ఉదయాన్నే అల్పాహారాన్ని మానేసిన పిల్లలు అల్పాహారం తీసుకొనే పిల్లల కంటే ఆటల్లో వెనకబడి ఉన్నారని, వీరిలో వెంటనే స్పందించే గుణం కూడా తక్కువ ఉందని తేలింది. 
 
అలాగే ఉదయాన్నే అల్పాహారం తీసుకోని ఉద్యోగస్తులు తీసుకున్న వారితో పోలిస్తే పనిమీద ఏకాగ్రత నిలపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని, పని విషయంలోనూ అంత నైపుణ్యాన్ని చూపించలేకపోతున్నారని తాజా అధ్యయనాల్లో తేలింది. ఉదయపు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి ఏర్పడే పోషకలేమి మధ్యాహ్నం పూట చేసే భోజనంతోగానీ, రాత్రిపూట కడుపుపగిలేలా తినే తిండితో కానీ భర్తీకాదు. 
 
అందుకే రోజంతా చురుకుగా ఉండడానికి పనిచేసుకొనే సామర్థ్యం కోసం గృహిణులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు  ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్లు, పిండిపదార్థాలు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.