శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (12:41 IST)

మహిళలూ.. కొబ్బరి నూనెతో వంట చేయండి.. ఒబిసిటీని తరిమికొట్టండి

అవును నిజమే. రిఫైన్డ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి వాటితో తయారు చేసే వంటల ద్వారా ఒబిసిటీ ఆవహిస్తుంది. అదే కొబ్బరి నూనెను వంటల్లో ఉపయోగిస్తే మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతాం. కొబ్బరినూనెల

అవును నిజమే. రిఫైన్డ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి వాటితో తయారు చేసే వంటల ద్వారా ఒబిసిటీ ఆవహిస్తుంది. అదే కొబ్బరి నూనెను వంటల్లో ఉపయోగిస్తే మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతాం. కొబ్బరినూనెలోని ఫ్యాటీ యాసిడ్స్.. ఎనర్జీని పెంచుతుంది. తద్వారా బరువును తగ్గిస్తుంది. 40 ఏళ్లు దాటిన మహిళలను వేధించే ప్రధాన సమస్య ఒబిసిటీ. 
 
ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే.. కొబ్బరినూనెతో పాటు సోయాబీన్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా వంటలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. చర్మానికి, శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని కెటోన్ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. 
 
కేరళలో కొబ్బరినూనెను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొబ్బరినూనెతో చేసిన వంటలు తింటే జీర్ణక్రియ వేగంగా జరుగుతాయి. ఫలితంగా కొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ నూనె వాడి చేసిన వంటలు త్వరగా జీర్ణమవుతాయి కూడా. శరీరారోగ్యాన్నే కాకుండా మానసిక ఒత్తిడినీ తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది. రక్తంలో చక్కెరస్థాయిని స్థిరపరుస్తుంది. 
 
డయాబెటిస్‌కి ఇది మంచి మందు. గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగకుండా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే శాచురేటెడ్‌ కొవ్వులు శరీరానికి ఎలాంటి హాని చేయవు. చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.