గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2016 (16:46 IST)

గోళ్లు సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు గోళ్లని కూడా జాగ్రత్తగా సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ 'సి' పోషక పదార్థం గోళ్లను సంరక్షించుటలో ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. విటమిన్ 'సి' ఎక్కువగా కలిగి ఉండే కూరగాయలు, ప

శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు గోళ్లని కూడా జాగ్రత్తగా సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ 'సి' పోషక పదార్థం గోళ్లను సంరక్షించుటలో ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. విటమిన్ 'సి' ఎక్కువగా కలిగి ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
 
నిమ్మ, స్వీట్ లైమ్, ఆరెంజ్, కమలా, పైనాపిల్, జామ, ఉసిరికాయ తదితర పండ్లల్లో విటమిన్ 'సి' అధికంగా ఉంటుంది. ధాన్యాలు, మొలకెత్తిన గింజలు తదితర పోషక పదార్థాలను వారానికి రెండు లేదా మూడు సార్లు తినాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బచ్చలికూర వంటి ఆకుకూరలను రోజూవారీ భోజనంలో చేర్చుకోవడం వల్ల గోళ్లు సురక్షితంగా ఉంటుంది. 
 
శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యానికి ఉపయోగపడే క్యాల్షియం, ఐరన్, విటమిన్, యాంటీఆక్సిడెంట్స్ ఆపిల్‌లో ఎక్కువగా ఉంది. ఉసిరికాయలో విటమిన్, క్యాల్షియం ఎక్కువగా ఉండటంతో పాటు త్వరగా దొరుకుతుంది. ఆహార పదార్థంలో ఉసిరికాయని చేర్చినట్లైతే గోళ్ల ఆరోగ్యం పెరుగుతుంది. కొవ్వు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తక్కువచేయడం చాలా మంచిది.