Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? ఐతే ఇవి తీసుకోండి..

సోమవారం, 20 మార్చి 2017 (17:11 IST)

Widgets Magazine
palakura

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? అయితే మందులు వాడటం చేస్తున్నారా? అయితే కాస్త ఆపండి. మనం తీసుకునే ఆహారం ద్వారానే ఒంట్లోని నీటిని బయటికి పంపించేయవచ్చు. ఒంట్లో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పులోని సోడియం శరీరంలో అధికంగా నీరుండేలా చేస్తుంది.

శరీరంలోని నీటిని వెలివేయాలంటే.. విటమిన్ బీ6 తప్పకుండా కావాలి. ఈ విటమిన్ పప్పు, చేపలు, డ్రై ఫ్రూట్స్, పాలకూరల్లో పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు అర‌టి పండ్లు, అవ‌కాడోలు, బీన్స్‌, పాల‌కూర వంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న నీరు బ‌య‌టికి పోతుంది.
 
నట్స్, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవడం మంచిది. నీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. పంచదార, పిండి పదార్థాలు, ఉప్పు తీసుకోకూడదు. ఇంకా వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరంలో నిల్వ అయ్యే అధిక నీటి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 
 
జీల‌క‌ర్ర‌ను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నా అధిక నీరు శ‌రీరం నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. జీలకర్రను రోజూ మీరు తాగే నీటిలో అరస్పూన్ లేదా ఒక స్పూన్ వేసి నానిన తర్వాత ఆ నీటిని తాగితే.. ఒంట్లోని నీరు బయటికి వెళ్తుంది. తద్వారా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

సెల్ ఫోన్ రేడియేషన్ పుణ్యంతో పిచ్చుకలు మాయం.. కాపాడండి.. మహాప్రభో..!

ఆధునీకరణ పేరుతో ప్రకృతి సంపద కనుమరుగువుతూ వస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం భవనాల సంఖ్య ...

news

టీ తాగు హాయ్ హాయ్... మతిమరుపు నై నై..

టీ కెటిల్‌ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. ...

news

బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి చిన్నారులకు తినిపిస్తే?

బొప్పాయి గుజ్జుని ఇన్ఫెక్షన్ చేరిన ప్రాంతంలో లేదా కాలిన గాయాల మీద పెట్టడం వల్ల అని త్వరగా ...

news

డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస మేలు..

డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస కాయను అధికంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ...

Widgets Magazine