గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 27 జనవరి 2016 (08:49 IST)

ఎముకలు కొరికే చలిలో వెచ్చవెచ్చగా ఉండాలంటే..

చాలా మంది చలికాలంలో గజగజ వణికిపోతుంటారు. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. చలిలో కూడా వెచ్చవెచ్చగా ఉండొచ్చు. 
 
చలి ఎంత తీవ్రంగా ఉన్నా వ్యాయామంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కాకపోతే వెచ్చటి దుస్తులు ధరించి చలిలో వ్యాయామం చేయాలి. చలికాలం కదా... ఎక్కువ నీరేం తాగుతాం అని తీసిపారేయకుండా వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగితో మంచిది. 
 
శరీరంలో వేడి పెంచేందుకు రాగులు, జొన్నలు, కొర్రలతో చేసిన జావ తాగండి. గోరువెచ్చటి నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగితే చర్మం పొడిబారడం తగ్గుతుంది. చలివేళ ఎముకలు కొరికేసినట్లుగా అనిపిస్తే తోటకూర, గోంగూర, పాలకూర, కరివేపాకు లాంటివి వంటకాల్లో ఎక్కువగా వాడితో మంచిది.