శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 26 అక్టోబరు 2016 (15:06 IST)

'వండర్‌ ఫ్రూట్'... కివీ పండు తొక్కలో ఏముందో తెలుసా...?

చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది. కమలాపండుకు రెట్టింపు 'విటమిన్‌ సి', ఆపిల్‌లో కన్నా అయిదు ర

చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది. కమలాపండుకు రెట్టింపు 'విటమిన్‌ సి', ఆపిల్‌లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం. న్యూజిలాండ్‌ ఇటలీ, ఆస్ట్రేలియా దేశాల్లోమాత్రమే పండే కివీలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లో కూడా విరివిగా దొరుకుతున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
బరువు తగ్గించుకోవాలని భావించేవారికి కివీ పండు చాలా మంచిది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి, సువాసన కూడా కివీ సొంతం. నారింజ, బత్తాయి వంటి పండ్లలో కన్నా ఇందులో 'విటమిన్ సి' రెట్టింపు మోతాదులో లభిస్తుంది. యాపిల్ కంటే 5 రెట్లు ఎక్కువ పోషకాలను ఇది కలిగి ఉంటుంది. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. దీన్ని 'వండర్‌ ఫ్రూట్' అని కూడా పిలుస్తారు. నిత్యం మనం తినే దాదాపు 27 రకాల పండ్లలో ఉన్నన్ని పోషకాలు ఒక్క కివీ పండులోనే దొరుకుతాయంటే అతిశయోక్తి కాదు.
 
రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి అధిక శాతం వరకు తగ్గిస్తాయి. శరీరంలో ఏర్పడే నైట్రేట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తెలిసింది. చర్మ, కాలేయ, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేలా చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి. మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. 
 
రక్త సరఫరా మెరుగుపడుతుంది. శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను తొలగిస్తుంది. పిల్లలకు కనీసం వారానికి ఒకసారి కివీ పండ్లను ఇస్తే దగ్గు, జలుబు వంటి అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచేలా చేయవచ్చు. కివి పండులోని యాంటీఆక్సిడెంట్స్ మంచి కొలెస్టిరాల్‌ను భస్మము చేయకుండా నిరోధించును. ఈ పండులోని "ఆర్జినిన్‌, గ్లుటామిన్‌" అనే రెండు అమినోయాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన గుండెకు రక్తము బాగా సరఫరా కావడానికి సహకరిస్తాయి. రక్తపోటును నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లను ఇస్తే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది. 
 
రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. కివీ పండులో ఉండే జింక్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. చర్మం, వెంట్రుకలు, పళ్లు, గోళ్లు తదితరాల పెరుగుదలకు జింక్ దోహదం చేస్తుంది. కివీ పండు తొక్కలో ఉండే ఫ్లావనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్ శరీరములోని ఫ్రీరాడికిల్స్‌ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కివి విత్తనాల నుండి తీసిన ఆయిల్‌లో 62% ఆల్ఫాలినోలిక్ , ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానికి చాలా మంచిది. కివి పండులోని ఫైటోకెమికల్స్, గ్జాంతోఫిల్స్ కంటిలో శాశ్వత అంధత్వానికి దోహదము చేసే "మాక్యులార్ డిజనరేషన్‌"ను నివారించును. మరో అధ్యయనములో కివి పండు నుంచి తీసిన రసము చర్మ క్యాన్సర్‌ను నిరోధిస్తుందని తేలింది.