కాలేయాన్ని దెబ్బతీసే చెడు ఆహారపదార్ధాలేంటి?

బుధవారం, 13 జనవరి 2016 (12:22 IST)

అతిగా మద్యం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుందని మనకు తెలిసిందే. అయితే ఇదొక్కటే కాదు. మనం తినే పదార్థాలు, పానీయాలు కూడా కాలేయం దెబ్బతినటానికి దోహదపడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం!
 
చక్కెరలను మితిమీరి తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది. శరీరం వినియోగించుకోకుండా మిగిలిపోయిన కేలరీలు ఏవైనా కాలేయంలో కొవ్వురూపంలో చేరిపోతాయి. 
 
రుచికరంగా ఉండటానికి చాలా పదార్థాల్లో మోనోసోడియం కలుపుతున్నారు. ఇది కాలేయాన్నిదెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. చిప్స్‌, వేయించి నిల్వచేసిన పదార్థాల్లో ఉప్పుతో పాటు ట్రాన్స్‌ఫ్యాట్స్‌ కూడా ఉంటాయి. ఇవి కూడా కాలేయం దెబ్బతినటానికి దారితీస్తుంది.
 
కంటి ఆరోగ్యానికి, చూపు బాగుండటానికి విటమిన్‌ ఏ ఎంతగానో తోడ్పడుతుంది. కానీ దీన్ని అవసరమైన దాని కన్నాఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయానికి హాని కలిగిస్తుంది. చక్కెర లేని లేదా డైట్‌ కూల్‌డ్రింకుల్లో ఉండే కృత్రిమ తీపి పదార్థాలతో పాటు కార్బన్‌‌డయాక్సైడ్‌ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల కూల్‌డ్రింకులను అదేపనిగా తాగితే కాలేయ జబ్బుకు దారితీస్తుంది.
 
అధిక రక్తపోటుకు ఉప్పుకి చాలా సంబంధం ఉంది. కానీ ఇది కాలేయ జబ్బునూ తెచ్చిపెడుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో ద్రవాల మోతాదులు పెరుగుతాయి. ఇది కాలేయంలో కొవ్వు పోగుపడటానికి దారి తీస్తుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చర్మాన్నిమిలమిల మెరిపించే ఆరెంజ్

చలికాలంలో కొందరికి చర్మం తెల్ల తెల్లగా పొడిబారినట్లు ఉంటుంది. కొందరు సహజంగానే పొడిబారిన ...

news

శీతాకాలంలో అరోమాథెరపీ.. మల్లెపూల వాసన ఘాటుగా, రొమాంటిక్‌గా?

కొన్ని పుష్పాల నుండి తయారు చేసే తైలాలు మంచి సువాసనను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఔషధ ...

news

తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనతను దూరం చేసుకోవచ్చట!

మనలో అనేక మందికి భోజనం చేసిన తరువాత 'పాన్' తినడం అలవాటు. మరి కొందరు తిన్నా, తినకపోయినా ...

news

కీళ్ల నొప్పులకు ఆవనూనెతో చెక్ పెట్టండి

సాధారణంగా అనేక మందికి వయస్సు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. ఎముకలు ...