Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొబ్బరి బొండాలను కూడా కల్తీ చేస్తున్నారట

బుధవారం, 12 అక్టోబరు 2016 (21:29 IST)

Widgets Magazine

విజ‌య‌వాడ ‌: కాస్త వేడి చేసిందంటే చాలు కొబ్బ‌రి నీళ్ళు తాగుతాం. జ్వ‌రం వ‌చ్చినా, నీరసంగా ఉన్నా కొబ్బ‌రి బొండాలు కావాల్సిందే. ఏ కాలమైనా మేలు చేసేవి కొబ్బరినీళ్లు. సర్వరోగ నివారిణిగా పేరున్న కొబ్బరి నీళ్లొక్కటే కల్తీ లేకుండా మనకు దొరుకుతున్నాయని మన నమ్మకం. సీజన్‌ను బట్టి ఎంత ధర పెట్టి అయినా కొని తాగే కొబ్బరినీళ్లలో కూడా కల్తీ జరుగుతోందట. అదెలా సాధ్యం? త్వరితగతిన కొబ్బరి పిందెలు కొబ్బరి బొండాలుగా తయారుకావాలని.. వాటిని ఎగుమతి చేసుకోవాలనే తాపత్రయంలో వీటిని కూడా కల్తీ చేస్తున్నారట.
 
కొబ్బరి చెట్టు వేర్లు ఉన్నచోట తల్లి వేరును బయటకు తీసి దానిని అక్కడే కవర్లో పెట్టి దానిపై మోనోక్రోటోఫాస్ అనే కెమికల్‌ను పోసి ఆ తరువాత మట్టితో కప్పేస్తారట. ఇలా ఆ కెమికల్‌ను చెట్టుకు ఎక్కించడం ద్వారా పిందెలు త్వరితిగతిన బొండాలుగా మారతాయట. అలా తయారైన బొండాలు తాగితే గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. చెట్టు నుంచి వాటి కెమికల్ పూర్తిగా నశించాలంటే 40 రోజులు పడుతుందట. సో.. మనం తాగుతున్న బొండాలు కూడా ఎంతవరకు సేఫ్? గ్యారంటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతా మాయాప్ర‌పంచం... క‌ల్తీమ‌యం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బూడిద గుమ్మడి ఇంటి ముందు దిష్టి తీసి పగలకొడతాం సరే... ఇందులో ఉండే ఔషధ గుణాలేమిటో తెలుసా..?

ఇంటి ముంగిట గుమ్మడిపండును వ్రేలాడదీయడం అలవాటు. అలాంటి బూడిద గుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ...

news

దంపతులు హ్యాపీగా ఉండాలా? సర్దుకుపోండి.. ఈ చిట్కాలు పాటించండి..

భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలా? దంపతులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలంటున్నారు మానసిక ...

news

పొట్ట బాగా పెరిగిపోయిందా? తగ్గాలంటే.. రోజూ ఆకుకూరలు తినండి

గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? పొట్ట బాగా పెరిగిపోయిందా? అయితే ఈ టిప్స్ ...

news

పెరుగులో జీలకర్ర పొడిని కలుపుకుని తింటే.. ఏమౌతుందో తెలుసా?

పెరుగులో జీలకర్ర పొడితో కలుపుకుని తింటే బరువు తగ్గుతారు. పెరుగులో వివిధ రకాల పండ్లను ...

Widgets Magazine