శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: శనివారం, 18 ఫిబ్రవరి 2017 (19:17 IST)

కొబ్బరి నూనె- యూకలిప్టస్ నూనెను మాడుకు మర్దన చేస్తే...?

యూకలిప్టస్‌-కొబ్బరినూనె కాంబినేషన్‌ జుట్టును మృదువుగా తయారు చేస్తుంది. కొబ్బరినూనెలో కొద్దిగా యూకలిప్టస్ నూనె కలిపి మాడుకు మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ క్రమంగా జరుగుతుంది. కుదుళ్లు గట్టిపడతాయి. అలానే షాంపూలో కలిపి వాడితే కండిషనర్‌లా పనిచేస్తుంది.

యూకలిప్టస్‌-కొబ్బరినూనె కాంబినేషన్‌ జుట్టును మృదువుగా తయారు చేస్తుంది. కొబ్బరినూనెలో కొద్దిగా యూకలిప్టస్ నూనె కలిపి మాడుకు మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ క్రమంగా జరుగుతుంది. కుదుళ్లు గట్టిపడతాయి. అలానే షాంపూలో కలిపి వాడితే కండిషనర్‌లా పనిచేస్తుంది. 
 
జుట్టు మృదువుగా మారుతుంది. దద్దుర్లూ, చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతుంటే కొద్దిగా ఆలివ్ ఆయిల్‌లో దీన్ని కలిపి రాసుకుంటే, సమస్యలు తగ్గుముఖం పడతాయి. సైనస్‌తో బాధపడే వారు ముక్కు, కణతుల దగ్గర కొద్దిగా యూకలిప్టస్ నూనె రాసుకుంటే ఫలితం ఉంటుంది.  
 
లావెండర్ ఆయిల్‌ను రాత్రిపూట రాసుకుంటే.?
లావెండర్ ఆయిల్‌ను రాత్రిపూట రాసుకుంటే చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది. పొడి చర్మం ఉన్నవారు రాత్రిపూట శరీరానికి మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.  లావెండర్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలున్నప్పుడు గిన్నెలో నీళ్లు పోసి నాలుగు చుక్కల లావెంటర్ నూనె వేసి మరిగిస్తే, ఇల్లంతా పరిమళ భరితంగా అవుతుంది. 
 
సహజ సిద్ధమైన ఈ వాసనతో అలర్జీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండదు. ఈ నూనెను షాంపూలో కలిపి వాడితే జుట్టు నుంచి మంచి వాసన వస్తుంది. దువ్వెన పళ్లకు చివరగా కొద్దిగా ఈ నూనె రాసి దువ్వుకుంటే జుట్టు మృదువుగా తయారవుతుంది. 
 
శారీరక ఒత్తిడి వేధిస్తున్నప్పుడు బకెట్‌లో గోరువెచ్చని నీళ్లు నింపి, నాలుగైదు చుక్కల లావెండర్ నూనె వేసి స్నానం చేస్తే చక్కటి ఉపశమనం లభిస్తుంది.