బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Eswar
Last Modified: సోమవారం, 14 జులై 2014 (17:34 IST)

కప్పు కాఫీ తాగండి... కుదిరితే కాదు తప్పకుండా....

పిల్లలు సంవత్సరమంతా కష్టపడి చదువుతారు. తీరా పరీక్ష రాసే సమయానికి చదివింది గుర్తుకు రాక చాలా ఇబ్బందులు పడతారు. మమ్మీ నిన్ననే చదివాను మమ్మీ.. కానీ గుర్తుకు రాలేక రాయలేదు.. అంటూ బాధపడుతుంటారు. ఇక ఇంటర్వ్యూ వెళ్లేవారు అంతే. చదివింది సమయానికి గుర్తుకురాక తల గోక్కుంటూ ఉంటారు.
 
ఐతే పరీక్ష రాయడానికి ముందు, ఇంటర్వ్యూకు వెళ్లేముందు ఒక కప్పు కాఫీ తాగి వెళ్లమంటున్నారు పరిశోధకులు. అనేకమంది విద్యార్థులను పరిశీలించిన తరువాత ఈ సూచనలు చేస్తున్నట్లు చెపుతున్నారు. ప్రతిరోజూ కప్పు కాఫీ తాగేవారిలో జ్ణాపక క్తి మెరుగ్గా ఉందటున్నారు. 
 
కాఫీలో కేఫిన్ అనే పదార్థం జ్ణాపకశక్తి మెరుగుపరుస్తుందని అంటున్నారు.. కాబట్టి పరీక్షలకు వెళ్లేవారు ఓ కప్పు కాఫీ తాగి వెళితే పరీక్ష బాగా రాస్తారని అంటున్నారు. ఓసారి తాగి చూసి టెస్ట్ చేసుకోండి మరి.