చుక్కేయనిదే నిద్రపట్టట్లేదా? ఐతే ఇవన్నీ తప్పవండోయ్

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (17:50 IST)

మందుకొట్టలేకుండా వుండలేకపోతున్నారా? చుక్కేయనిదే.. నిద్రపట్టడం లేదా? అయితే మానసిక సంబంధిత రుగ్మతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపుతడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. సెంటర్ ఫర్ అడిక్షన్ అండ్ మెంటల్ హెల్త్ (ఫ్రాన్స్) పరిశోధకులు నిర్వహించిన సర్వేలో మద్యం సేవించే వారిలో అతి త్వరిగతిన మానసిక వైకల్యం, చిత్తవైకల్యం ఏర్పడుతుందని తేలింది.


ఒక మిలియన్ మందిపై జరిపిన ఈ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. మానసిక ఒత్తిడి, డయాబెటిస్, రక్తపోటు వంటివి కూడా మద్యాన్ని సేవించడం ద్వారా తప్పక వేధిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. 
 
మరోవైపు ప్రతిరోజూ ఓ గ్లాసుడు చొప్పున మద్యం తీసుకుంటే.. ఆయుష్షు 30 నిమిషాలు తగ్గిపోతుందని.. మరో అధ్యయనంలోనూ వెల్లడి అయ్యింది.

వారానికి పది గ్లాసులకు పైగా మద్యం తాగిన వారిలో ఒకటి నుంచి రెండేళ్ల ఆయుష్షు తగ్గిపోతుందని.. ప్రతివారం 18 గ్లాసులకు మించిన మద్యం తీసుకుంటే మాత్రం నాలుగైదేళ్ల ఆయుష్షు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనకు సంబంధించి యుకే పరిశోధకులు కనుగొన్న అధ్యయనానికి సంబంధించి ఆర్టికల్‌ను శుక్రవారం ది లాన్సెట్‌లో ప్రచురించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

క్యారెట్‌ను వంటల్లో కాదు.. ఇలా ట్రై చేసి చూడండి..

క్యారెట్‌ను వంటల్లో చేర్చుకుంటుంటారు. అయితే క్యారెట్‌ను ఉడికించకుండా పచ్చిగా తీసుకోవడం ...

news

వేసవిలో సబ్జా గింజలను కొబ్బరి నీటిలో నానబెట్టి తాగితే?

వేసవిలో సబ్జా గింజలను కొబ్బరి నీటిలో నానబెట్టి తాగితే...శరీర తాపం తగ్గిపోతుంది. సబ్జా ...

news

లిఫ్ట్ ఉపయోగిస్తున్నారా? మెట్లెక్కుతున్నారా?

లిఫ్ట్ ఉపయోగిస్తున్నారా? మెట్లెక్కుతున్నారా?.. లిఫ్ట్ అధికంగా ఉపయోగిస్తే అనారోగ్య ...

news

రెండు యాలకులు, ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు ఎంత ఆరోగ్యమో...

యాలకులను ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ ప్రెష్ నర్ గా వాడుతుంటారు. టీ తయారీలో యాలకులను ...