బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (18:56 IST)

ఫేస్ బుక్‌‍ పుణ్యమా అంటూ జంక్ ఫుడ్ తినేస్తున్నారట!

ఫేస్ బుక్‌‍ పుణ్యమా అంటూ జంక్ ఫుడ్ తినేస్తున్నారట! అవునా? ఇదేంటి అనుకుంటున్నారా? నిజమండీ బాబూ.. జంక్ ఫుడ్ తినడానికి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా కూడా ఓ కారణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. 
 
బాలబాలికలు పిజ్జా, బర్గర్లను తినేందుకు అత్యంత ఆసక్తి చూపడం వెనుక కారణం సోషల్ మీడియానే అని ఆ సర్వే స్పష్టం చేసింది. తద్వారా ఒబిసిటీ తప్పదని సర్వేలో తేలింది. 
 
సోషల్ మీడియాలోని సైట్లలో జంక్ ఫుడ్స్‌కు సంబంధించిన మార్కెటింగ్ ఎక్కువగా ఉందని, దీంతో పిల్లలు వీటిపై అమితాసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. సో.. ఇదండీ సంగతి.!