దేశంలో పెరుగుతున్న మూర్ఛరోగులు : డాక్టర్ దినేష్ నాయక్

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (09:47 IST)

దేశంలో మూర్ఛరోగుల సంఖ్య పెరుగుతోందని, దీనికి కారణంగా ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అధునాత వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిపై అవగాహన లేకపోవడమేనని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి న్యూరాలజీ, ఎపిలెప్సి విభాగ అధిపతి డాక్టర్ దినేష్ నాయక్ అన్నారు. ఆ ఆస్పత్రిలో మూర్ఛరోగ సహాయక బృందం విభాగాన్ని తొలిసారి ఏర్పాటు చేసింది. ఈ విభాగం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ ఆరోగ్యం సంస్థ నివేదిక మేరకు భారత్‌లో 12 మిలియన్‌ల మంది మూర్ఛరోగ నిపుణులు ఉన్నారని చెప్పారు. ఇది ప్రపంచంలో ఐదో వంతు అని వెల్లడించారు.
 
వాస్తవంగా మూర్ఛ రోగానికి తగిన చికిత్స ఉందన్నారు. కానీ, దీనిపై చాలా మంది సరైన అవగాహన లేదన్నారు. దేశంలో ఉన్న మూర్ఛరోగుల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న రోగుల్లో సగటున 60 శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారని ఆయన వివరించారు. దీనికి ప్రధాన కారణం సరైన అవగాహన లేకపోవడమేనని ఆయన గుర్తు చేశారు.
fortis malar team
 
ఇకపోతే.. ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో ప్రారంభించిన మూర్ఛరోగ సహాయక బృందంపై ఆయన స్పందిస్తూ... ఈ బృందం ఆస్పత్రిలో చికిత్స పొందే, చికిత్స కోసం వచ్చే మూర్ఛరోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యుల్లో సరైన అవగాహన కల్పించడమే ప్రధాన విధి అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎపిలెప్సి విభాగానికి చెందిన పలువురు మాజీ ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీనిపై మరింత చదవండి :  
Support Group Dr Dinesh Nayak Fortis Malar Hospital Comprehensive Epilepsy Centre

Loading comments ...

ఆరోగ్యం

news

రోజూ ఓ అరటి పండు తినండి... ఆరోగ్యంగా ఉండండి..

ప్రతిరోజూ ఓ అరటి పండు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చునని.. అనారోగ్య సమస్యల నుంచి ...

news

గోంగూర తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు.. బట్టతల రాకుండా?

గోంగూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి ...

news

బిర్యానీ లాగిస్తున్నారా? నెయ్యి, వనస్పతి, డాల్డా, మసాలాలతో ఇబ్బందే!

షాపుల్లో బిర్యానీ లాగిస్తున్నారా? అయితే కాస్త వెనక్కి తగ్గండి. పుట్టిన రోజు వేడుకలైనా, ...

news

షాపుల్లో పండ్ల రసాలను ఎంచక్కా లాగిస్తున్నారా? జ్యూసుల్లో వాడే ఐస్ ఎలా చేస్తారో తెలుసా?

తాజా పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు. ఇక ఇంట్లో తాజా ...