శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (16:15 IST)

చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతే కలిగే అనారోగ్య సమస్యలేంటి?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేదా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో హెడ్‌ఫోన్స్ ఉండటం మనం చూస్తుంటాం. వీటిని చెవులకు ధరించి రేయింబవుళ్లు పాటలు వింటూనే నిద్రలోకి జారుకుంటుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే నిద్రకు ఉపక్రమించాక ఆ హెడ్‌ఫోన్స్ తీసి పడుకుంటారు. 
 
ఇలా నిద్రపోయేటపుడు పడుకోవడం వల్ల రాత్రి నుంచి ఉదయం వరకు ఆ హెడ్‌‌ఫోన్స్ అలానే చెవులకు ఉండిపోతాయి. ఇలా రాత్రంతా చెవులకు హెడ్‌ఫోన్స్ తగిలించుకుని సంగీతం వినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
వాస్తవానికి నిద్రించేటప్పుడు మెదడు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకుంటుంది. ఈ క్రమంలో రాత్రంతా హెడ్‌ఫోన్స్‌ను అలాగే ఉంచి నిద్రిస్తే శరీర కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. ప్రధానంగా విశ్రాంతి దశలో ఉండే మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. నిద్రలేమి, అలసట వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.