పాత కరెన్సీ నోట్లతో జాగ్రత్త... ఆ నోట్లు వ్యాధులను మోసుకొస్తాయ్ జాగ్రత్త

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (22:58 IST)

పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు పూర్తిస్థాయిలో విడుదలవుతున్నాయి. ఐతే ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొస్తాయంటే నమ్మబుద్దికాదు కానీ, ఇది జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికారక మైక్రో ఆర్గానిజమ్స్ డజన్లకొద్దీ కరెన్సీ నోట్లను అంటిపెట్టుకుని ఉంటాయట. రూ. 10, రూ. 20, రూ. 100 కరెన్సీ నోట్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు ఢిల్లీకి చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. ఈ కరెన్సీ నోట్ల కారణంగా సుమారు 78 వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ గుర్తించింది. 
 
వీటిలో చాలామటుకు ఫంగై, బ్యాక్టీరియా కారక రూపంలో నోట్లను అంటిపెట్టుకుని ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. వీటి ఫలితంగా డీసెంట్రీ, ట్యుబర్కులోసిస్, అల్సర్లు కూడా వచ్చే అవకాశం లేకపోలేదని చెపుతున్నారు. ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొచ్చే వాహకాలుగా కూడా పనిచేసే అవకాశం ఉందని చెపుతున్నారు. 
 
ఐతే వాస్తవ రూపంలో ఇవి మనుషులపైన ఎంతమేరకు ప్రభావం చూపుతాయన్నది ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఐతే అవకాశం లేదని చెప్పలేమని కూడా అన్నారు. కరెన్సీ నోట్లను స్నాక్ దుకాణాలు, రోడ్లపై నడిపే దుకాణాదారులు, మార్కెట్లు వంటి వారి వద్ద నుంచి సేకరించి పరిశీలించినట్లు వారు తెలిపారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఈ టీ తాగితే రోగాలను అడ్డుకోవచ్చు....

ఆ టీ ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని ...

news

మునగపూలను పాలలో వేసుకుని తాగితే....

మునగలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. ...

news

ఈ పండుతో కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించుకోవచ్చు....

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్థాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి ...

news

రక్తపోటును తగ్గించే మందారం టీ....

మందార మొక్క అనేది ఉష్ణమండల మరియు వెచ్చని ప్రాంతాల్లో పెరిగే అందమైన పుష్పించే మొక్క. ఒక ...