గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (10:27 IST)

నగరాల్లో నివసించే మహిళల్లో 61శాతం మందికి గుండెజబ్బులు

దేశంలోని నగరాల్లో నివశించే మహిళల్లో 61 శాతం మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఓ సర్వేలో తేలింది. ప్రపంచ హృద్రోగ దినోత్సవం మంగళవారం జరుపుకుంటున్న నేపథ్యంలో... సఫోలా లైఫ్‌ అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. 
 
ఈ సర్వేను భారత్‌లోని టాప్‌ టెన్‌ పట్టణాల్లో నివసిస్తున్న 30-45 ఏళ్ల మధ్య వయసు గల మహిళలపై ఈ సర్వే నిర్వహించారు. మారుతున్న జీవన విధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఆలస్యంగా ఆహారం తీసుకోవడం తదితరాల వల్ల 61 శాతం మహిళల్లో గుండె జబ్బులొచ్చే ప్రమాదం తేలింది. 
 
అదేవిధంగా శారీరక వ్యాయామం తక్కువగా ఉండటం, మధుమేహం, హైబీపీల్లాంటివి కూడా మహిళల్లో గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతున్నాయని చెప్పారు. పైగా.. కుటుంబ పోషణం భారం పెరిగి, వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపక పోవడం కూడా ఓ కారణంగా ఉందని తెలిపింది.