శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (14:25 IST)

అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలుసా...!

ఈరోజో.. నిన్ననో పుట్టిన బిడ్డ బాగా ఏడుస్తూనే ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో అని తెలుసుకోవాలని ఉన్నా ఏవో కారణాల వల్ల తెలుసుకోలేకపోయినా ఉండవచ్చు. నిజంగా ఓ బిడ్డ పుట్టగానే ఎందుకు ఏడు

ఈరోజో.. నిన్ననో పుట్టిన బిడ్డ బాగా ఏడుస్తూనే ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో అని తెలుసుకోవాలని ఉన్నా ఏవో కారణాల వల్ల తెలుసుకోలేకపోయినా ఉండవచ్చు. నిజంగా ఓ బిడ్డ పుట్టగానే ఎందుకు ఏడుస్తుంది అంటే.. అమ్మ కడుపులో ఉన్న ఆ 10 నెలలు లయబద్దంగా వినపడే గుండె చప్పుడును వింటూ తన్మయం చెందుతూ ఉంటుంది. ఆ చప్పుడులో తనను తాను మరిచిపోయి ఆ చప్పుడే తనగా రక్షణంగా భావిస్తూ ఉంటుంది.
 
బయట ప్రపంచంలోకి రాగానే ఆ చప్పుడు దూరమై తనకు ఏదో అవుతోంది అని భయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ బిడ్డ. ఆ ఏడుపు తల్లి ఒడిలోకి చేరగానే ఆపేస్తుంది... గమనించండి.. తల్లి తనను దగ్గరగా తీసుకోగానే మళ్ళీ ఆ గుండె చప్పుడు తిని తనకు ఏమీ భయం లేదని ఆ బిడ్డకు తెలిసిపోతుంది. నిజంగా తల్లిమీద ఆ పసికూనకు ఎంత నమ్మకమో కదా! అమ్మ ప్రేమకు అనురాగానికి సాటి లేదు. చివరికి తన గుండె చప్పుడు కూడా ఆ బిడ్డకే అంకితం చేసే అమ్మతనానికి శతకోటి వందనాలు.