శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (06:32 IST)

ఔషధాల్లో కల్తీని తెలుసుకోండిలా?

ప్రస్తుతం మార్కెట్‌లో నకిలీల బెడద ఎక్కువైపోయింది. తినే ఆహార పదార్థాల నుంచి వేసుకునే మందులవరకు ఈ బెడద అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లోని నకిలీ మందులను గుర్తించేందుకు అమెరికాకు చెందిన రెండు విశ

ప్రస్తుతం మార్కెట్‌లో నకిలీల బెడద ఎక్కువైపోయింది. తినే ఆహార పదార్థాల నుంచి వేసుకునే మందులవరకు ఈ బెడద అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లోని నకిలీ మందులను గుర్తించేందుకు అమెరికాకు చెందిన రెండు విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఓ పేపర్ కార్డును కనిపెట్టారు. 
 
ఈ కార్డుపై 12 రేఖలు ఉంటాయి. ప్రతి రేఖ మీద ఆయా ఔషధాల్లో ఏ అంశాలు ఉన్నాయో గుర్తించే కొన్ని రకాల పరీక్షా పదార్థాలు ఉంటాయి. వాటి మీద మనం పరీక్షించాలనుకున్న మాత్రను రుద్దాలి. ఆ తర్వాత కార్డు అడుగు భాగాన్ని మూడు నిమిషాల పాటు నీళ్లలో ఉంచాలి. ఆ వెంటనే ఎన్ని రకాల రసాయనాలు ఉన్నాయో వాటిలో ఎన్ని ఆరోగ్యానికి మేలు చేస్తాయో ఏవి హాని చేస్తాయో తెలిసిపోతుంది. 
 
ఈ కార్డు స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. దీంతో పరీక్ష వివరాలు యూజర్‌ మెయిల్‌ఐడీకి పంపించుకోవచ్చు. కేవలం 70 రూపాయల విలువున్న చిన్న కాగితం ముక్కతో ఔషధాల నాణ్యతను తెలుసుకోవచ్చు.