శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 27 జులై 2015 (09:47 IST)

బాల్యంలో ఒత్తిడికి గురైతే.. పెద్దయ్యాక..బరువు పెరుగుతారా...!

చిన్నపిల్లలు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారా... ! తల్లిదండ్రులు వారిపై మానసిక ఒత్తిడికి బ్రేక్ వేయాల్సిందే. లేదంటే వారు భవిష్యత్తులో బరువు సమస్య ఎదుర్కోక తప్పదట. ఈ విషయాన్ని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. మిచిగన్ వర్శిటీ పరిశోధకులు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి.
 
అమెరికాలోని మిచిగన్‌ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. సుమారు 3,700 మంది స్త్రీ, పురుషుల మీద వీరు సుమారు 15 యేళ్ళ పాటు సర్వే నిర్వహించారు. వీరి ఆహార అలవాట్లు, చిన్నతనంలో ఎదుర్కొన్న ఒత్తిడిలు తదితర కారణాలను పరిశీలించారు. చిన్న వయస్సులో ఆడపిల్లలు, మగపిల్లలు దాదాపు ఒకే విధమైన ఒత్తిడికి గురవుతారనీ, అయితే వారు పెద్దయిన తరువాత స్త్రీలలోనే ఊబకాయం అనే సమస్య అధికంగా కనిపించిందని వీరు చెబుతున్నారు. 
 
ఒత్తిడికి గురైన స్త్రీలు ఎక్కువగా ఆహారం తీసుకుంటే పురుషులు మద్యం మోతాదుకు మించి సేవిస్తారనీ, ఇది వారి ఊబకాయానికి దోహద పడుతుందని పరిశోధకులు అంటున్నారు. సో పేరంట్స్ పిల్లలు పడే ఒత్తిడిపై కన్నేయండి..