Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పురుషులకు కూడా ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలు

హైదరాబాద్, గురువారం, 6 జులై 2017 (06:17 IST)

Widgets Magazine
abortion pills kit

గర్భనిరోధక సాధనాలలో బహుళ ప్రాచుర్యం పొందిన కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ మహిళల కోసం ఉద్దేశించినవన్న విషయం తెలిసిందే! కానీ త్వరలో పురుషులకు కూడా ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రానున్నాయి. వీర్య కణాల కలయికతో అండం ఫలదీకరణచెంది కొత్త జీవి ప్రాణంపోసుకుంటుంది. కానీ ఈ మాత్రలు వీటి కలయికను అడ్డుకోవడం ద్వారా గర్భం దాల్చకుండా నిరోధిస్తాయని వైద్యులు వివరించారు. 
 
అండంలోకి ప్రవేశించే సమయంలో వీర్యకణాలకు తోడ్పడే ఓ కీలకమైన ప్రొటీన్‌ను పరిశోధకులు గుర్తించారు. దీన్ని అడ్డుకునే మార్గాన్ని కనుగొంటే మగవారికోసం ప్రత్యేకంగా కాంట్రాసెప్టివ్‌ మాత్రలను తయారుచేయవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా పరిశోధకుడు జాన్‌ హెర్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా తయారుచేయవచ్చని జాన్‌ వివరించారు.
 
లైంగిక కలయిక ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించి రంగు మారే కొత్తరకం కండోమ్‌ను యూకే స్కూలు విద్యార్థుల బృందం అభివృద్ధి చేసింది. ‘ఎస్‌.టి.ఈవైఈ’ గా వ్యవహరిస్తున్న ఈ కండోమ్‌ సిఫిలిస్‌ తదితర వ్యాధులలోని బ్యాక్టీరియాను గుర్తిస్తుంది. 
 
ఈ బ్యాక్టీరియాను తాకిన ప్రతిసారీ కండోమ్‌ రంగు మార్చుకుంటుంది. తద్వారా ఒకరినుంచి మరొకరికి లైంగిక వ్యాధులు సోకకుండా నిరోధించేలా, ఓ హెచ్చరికగా పనిచేసేందుకే ఈ కొత్తరకం కండోమ్‌ను తయారుచేసినట్లు యూకే బృందం పేర్కొంది.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే శ్వాసకోశ వ్యాధులు... ఈ ఆసనం వేస్తే...

శ్వాసకోశ వ్యాధుల నివారణకు భుజంగాసనం మంచి మేలు చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలో ...

news

ఏ పదార్థాలను వేటితో కలిపి తినకూడదో తెలుసా?

కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య ...

news

వీర్యకణాల నాణ్యతకు చేపలు.. తృణధాన్యాలు తప్పక తీసుకోవాలట..

సంతానలేమి వేధిస్తోందా..? అయితే ఆహారంలో మార్పులు చేయాల్సిందే. వీర్య కణాలు ఆరోగ్యంగా, ...

news

వీకెండ్‌లో హోటళ్లకు వెళ్లి.. ఫుల్‌గా లాగిస్తున్నారా?

వారమంతా ఇంటి భోజనం తిని బోర్ కొట్టేసిందా? వీకెండ్ ఏదైనా హోటల్‌కు వెళ్ళి ఫుల్‌గా లాగించే ...

Widgets Magazine