బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 9 నవంబరు 2014 (19:54 IST)

'బాసూ నాకు మెమరీ లాసూ'.... ఆసియా పసిఫిక్ లో 7.10 కోట్లు

సహజంగా వయసు పైపడేకొద్దీ కొంతమందిలో మతిమరుపు సమస్య తలెత్తడం జరుగుతుంది. ఈ సమస్య భారతదేశంలో ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ విషయం ఏడీఐ... అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో 17వ ఆసియా పసిఫిక్ రీజియన్ సదస్సులో నివేదికలో తెలియజేశారు. 
 
2050 నాటికి భారతదేశంలో సుమారు కోటీ 20 లక్షల మంది ఉంటారని నివేదికలో వెల్లడైంది. అలాగే ఆసియా పసిఫిక్ రీజియన్‌లో 7.10 కోట్ల మంది మెమెరీ లాస్ తో సతమతమవుతారని అంచనా.