గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (15:24 IST)

బ్రిటన్‌లో నగ్న యోగాకు పెరుగుతున్న డిమాండ్!

ప్రపంచ వ్యాప్తంగా నగ్న యోగాకు డిమాండ్ పెరిగిపోతోంది. నిజానికి భారత్ యోగాలకు పుట్టినిల్లు. యోగా వల్ల చేకూరే అనేక ప్రయోజనాలు తెలుసుకున్న విదేశీయులు భారత్ వచ్చి మరీ నేర్చుకున్నారు. దీంతో యోగా విశ్వవ్యాప్తమైంది. అయితే, భారతీయ యోగాకు ప్రాశ్చాత్య సంస్కృతిని జోడించి.. సరికొత్త యోగాను కనిపెట్టారు. అదే నగ్న యోగా. తాజాగా వారు సరికొత్త యోగాను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. అదే నగ్న యోగా. అంటే, ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా యోగా చేయడమన్నమాట. 
 
ఈ తరహా యోగా తొలుత అమెరికా నగరం న్యూయార్క్‌లో ప్రారంభమైన ఈ నయా యోగా మంత్రం, తాజాగా బ్రిటన్ రాజధాని లండన్‌కూ పాకింది. రెండేళ్ల క్రితం లండన్‌లో ప్రారంభమైన ఈ తరహా యోగా తరగతులకు అక్కడి జనం వెల్లువలా తరలివస్తున్నారట. తాను చేపట్టిన నగ్న యోగాకు తొలి రోజు నుంచే ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో లండన్ వాసులు ఆసక్తి వ్యక్తం చేశారని దీనిని లండన్‌కు పరిచయం చేసిన అన్నెట్టే చెబుతున్నారు. 
 
ఇప్పటికీ నిత్యం తాను నేర్పుతున్న నగ్న యోగా క్లాసులకు హాజరవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. నగ్న యోగా వల్ల ఆత్మాభిమానం పెరగడమే కాక మానసిక ఒత్తిడి దూరమవుతోందట. ఇప్పటికే పాప్ గాయని లేడి గాగా, నగ్న యోగాను ప్రయోగించి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందినట్టు అన్నెట్టే చెపుతున్నాడు.