శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 జూన్ 2016 (11:21 IST)

కేంద్ర సర్వీసుల్లో వైద్యుల రిటైర్మెంట్ వయసు 65 యేళ్లు.. ప్రధాని ఆమోదం

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పని చేసే ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 యేళ్లకు పెంచారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదముద్ర వేశారు.

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పని చేసే ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 యేళ్లకు పెంచారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదముద్ర వేశారు. దేశంలో వైద్యుల కొరతను అధిగమించి.. నిపుణులైన ప్రభుత్వ వైద్యుల సేవలు నిరంతరం కొనసాగేందుకు వీలుగా ప్రభుత్వ డాక్టర్ల పదవీ విరమణ వయసును కేంద్రం 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైద్యులు గానీ, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లు గానీ ఎవరికైనా ఈ నిర్ణయం వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్యుల అవసరం చాలా ఉందని, రెండేళ్లలో భర్తీ చేయడం సాధ్యపడలేదని, ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్‌ వయసును 65 ఏళ్లకు పెంచుతామని గతవారం యూపీలోని శహరాన్‌పూర్‌ సభలో ప్రధాని ప్రకటించారు. దానికనుగుణంగా ఇప్పుడు ఉత్తర్వులు వెలువడ్డాయి.