పురిటి నొప్పుల సమయంలో డ్యాన్స్...

సాధారణంగా మహిళలు గర్భధారణను నవమాసాలు మోయటం ఒక ఎత్తు అయితే.. పిల్లల్ని ప్రసవించడం మరో ఎత్తు. ప్రసవ సమయంలో మహిళల కష్టాలు వర్ణాతీతంగా ఉంటాయి.

dance
pnr| Last Updated: సోమవారం, 22 జనవరి 2018 (11:55 IST)
సాధారణంగా మహిళలు గర్భధారణను నవమాసాలు మోయటం ఒక ఎత్తు అయితే.. పిల్లల్ని ప్రసవించడం మరో ఎత్తు. ప్రసవ సమయంలో మహిళల కష్టాలు వర్ణాతీతంగా ఉంటాయి. ఒక వైపు పురిటినొప్పులు భరిస్తూనే... మరో వైపు పండంటి బిడ్డకు జన్మనిస్తారు. ఆ సంతోషంలో ఆనందభాష్పాలు రాల్చుతారు.
అయితే, ప్రసవ సమయంలో పురిటినొప్పుల బాధ మరిచిపోవాలనే ఉద్దేశంతో బ్రెజిల్‌కు చెందిన డాక్టర్ ఫెర్నాండో ఆ సమయంలో వారితో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. పురిటినొప్పుల సమయంలో డ్యాన్స్ చేయడంతో గర్భిణికి కాస్త ఉపశమనం కలుగుతుందని వైద్యుడి వాదనగా ఉంది. ప్రసవానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదనీ, సుఖ ప్రసవం జరుగుతుందని డాక్టర్ ఫెర్నాండో అంటున్నారు.
దీనిపై మరింత చదవండి :