శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2014 (14:54 IST)

''ఏబీ'' బ్లడ్ గ్రూపైతే... డిమెన్షియాతో జాగ్రత్త!!

మీది "ఏబీ" బ్లడ్ గ్రూపైతే.. డిమెన్షియాతో జాగ్రత్త పడాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. డిమెన్షియా వార్ధక్యంలో వచ్చే జబ్బుల్లో ఒకటి. దీన్ని చిత్తచాంచల్యంగానూ పరిగణిస్తారు. 
 
కానీ వెర్మోంట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు డిమెన్షియాకు వ్యక్తుల బ్లడ్ గ్రూపుకు సంబంధం ఉంటుందని చెబుతున్నారు. దీనిపై నిర్వహించిన అధ్యయనంలో..మిగిలిన బ్లడ్ గ్రూపుల కంటే, 'ఏబీ' గ్రూపు వ్యక్తుల్లో వయసు పైబడే కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు తలెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తేలింది.
 
ప్రపంచ జనాభాలో 4 శాతం ఏబీ గ్రూపు వ్యక్తులే కాగా, వారిలో 82 శాతం వృద్ధాప్యంలో డిమెన్షియాకు గురయ్యే అవకాశాలున్నాయని అధ్యయనకర్త మేరీ కుష్మన్ తెలిపారు. 
 
ఈ అధ్యయనంలో భాగంగా 587 మందిని పరిశీలించగా, 495 మందిలో డిమెన్షియా లక్షణాలు కనిపించాయి. దీంతో, బ్లడ్ గ్రూపుకు ఈ మెదడు సంబంధ వ్యాధికి సంబంధం ఉంటుందన్న విషయం వెల్లడైందని కుష్మన్ పేర్కొన్నారు. 
 
కాగా, పరిశోధకులు మరో విషయాన్ని కూడా గుర్తించారు. రక్తం గడ్డ కట్టేందుకు తోడ్పడే వీ3 ప్రొటీన్ స్థాయులు ఎక్కువైనా గానీ డిమెన్షియా ముప్పు ఉంటుందని తెలిపారు.