శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (09:50 IST)

'తక్కువ సేపు కూర్చోండి.. ఎక్కువ సేపు కదలండి'.. ఆ ముప్పు నుంచి బయటపడండి

'తక్కువ సేపు కూర్చోండి.. ఎక్కువ సేపు కదలండి'.. అని సౌత్ కాలిఫోర్నియాలోని బిహేవియరల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డెబోరా రోహమ్ యంగ్ సలహా ఇస్తున్నారు. లేనిపక్షంలో గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉన్నట్టు ఆయన

'తక్కువ సేపు కూర్చోండి.. ఎక్కువ సేపు కదలండి'.. అని సౌత్ కాలిఫోర్నియాలోని బిహేవియరల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డెబోరా రోహమ్ యంగ్ సలహా ఇస్తున్నారు. లేనిపక్షంలో గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉన్నట్టు ఆయన హెచ్చరిస్తున్నాడు. 
 
ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల గుండె పనితీరు, రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. అలాగే దీర్ఘకాలం పాటు కూర్చోవడం వల్ల డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మందగిస్తుందని తెలిపారు. 
 
వీటి ఫలితంగా ఏ కారణంగానైనా చనిపోయే ప్రమాదం ఉందని అధ్యయనకారులు తెలిపారు. అయితే ఎంతసేపు కదలకుండా కూర్చుంటే ఈ జబ్బులు వస్తాయన్న ఖచ్చితమైన సమాచారం తమవద్ద లేదన్నారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నవారు కూడా ఎక్కువ సేపు కూర్చుంటే ఈ వ్యాధుల బారిన పడక తప్పదని పేర్కొన్నారు.