శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 29 జులై 2014 (16:16 IST)

సిక్స్ ప్యాక్ టిన్ బీర్లు తాగారో.... అంగం స్తంభించదు... అంతే సంగతులు...

మనం చూస్తుంటాం కదా. ఈమధ్య పళ్ల రసాలను రకరకాల ఆకర్షణీయ డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇపుడు అదే రీతిలో సిక్స్ ప్యాక్ బీర్లంటూ ఆరు డబ్బాలు ప్యాక్ చేసిన ప్యాకెట్లు ఆఫర్ ధరలకే అమ్ముతున్నారు. ఇవి సూపర్ మార్కెట్లలోనూ లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని తాగితే యమ డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
వీటిలో మోసోపోడియం గ్లూకమేట్, అధిక చక్కెరలు కలిగిన ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిపుతున్నారట. వీటిని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఖాయమంటున్నారు. అంతేకాదు వీటిలో ఉండే బిస్‌ఫినాల్-ఎ కు పురుషుల్లో అంగాన్ని స్తంభించకుండా చేసే గుణమున్నట్లు చెపుతున్నారు. వీర్య కణాలు కూడా పెరగవు, మొత్తంగా పురుషులు సంతాన సాఫల్య శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంకా వీటిని సేవించడం వల్ల ఎన్నో అనర్థాలున్నాయని అంటున్నారు.