గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 27 జులై 2015 (17:03 IST)

నిద్రపోకపోతే ఏం...? ఒక్క రాత్రే కదా అనుకోకండి...

చాలామంది ఉద్యోగరీత్యా సగం రాత్రి వరకూ నిద్రపోరు. కంప్యూటర్ల ముందు కూర్చొని ఆఫీస్ పనుల్లో రాత్రంతా మేల్కొని ఉంటారు. ఒక్క రాత్రే కదా ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఆ ప్రభావం మొదడుపై పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఆ ప్రభావం మెదడులో ఎన్ఎస్ఇ, ఎస్-100 బి అనే కణాలపైన పడుతుంది. రక్త గాఢతలో మార్పు రావడం వల్ల మెదడులో ఉండే త్వచాలు దెబ్బతింటాయి. 15 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల మీద పరిశోధనలు చేసిన మీదట ఈ విషయం తెలిసిందని పరిశోధకులు అంటున్నారు.
 
మెదడుకి దెబ్బ తగిలినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో నిద్రపోకపోతే కూడా అదే పరిస్థితి అంటున్నారు వాళ్లు. అందుకని ఇక మీదట రాత్రుళ్లు మేల్కొని కంప్యూటర్లతో, సెల్‌ఫోన్లతో కుస్తీలు పడకుండా ఎంచక్కా నిద్రపోండి.