శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (17:12 IST)

స్వైన్ ఫ్లూ మహమ్మారి.. భారత్‌లో 624 మంది మృతి!

స్వైన్ ఫ్లూ మహమ్మారి బారిన పడిన భారత్‌లో 624 మంది మృతి చెందారు. గడచిన నెలన్నర వ్యవధిలో స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు.

ఈ సంవత్సరం జనవరి 1 నుంచి మరణించిన వారి సంఖ్య 624గా నమోదు కాగా, ఇప్పటివరకు 9,311 మందికి స్వైన్‌ ఫ్లూ సోకినట్టు తేలిందని వివరించారు. 
 
ఈ వ్యాధితో రాజస్థాన్‌‌లో అత్యధికంగా 176 మంది, గుజరాత్‌‌లో 150 మంది, తెలంగాణలో 46 మంది, మహారాష్ట్రలో 58 మంది, మధ్యప్రదేశ్‌‌లో 81మంది బలయ్యారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో గడిచిన నాలుగు రోజుల్లోనే సుమారు 139 మంది మృతి చెందారు. వాస్తవానికి స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.